Minister Sridhar Babu: హైదరాబాద్ లో నేడు (ఫిబ్రవరి 18) న జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోని టెక్నాలజీ రంగం సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ రంగంలో కీలకంగా ఎదిగిపోతుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ గురించి ప్రపంచం ఆసక్తిగా చూస్తున్నదని, ఇది టెక్నాలజీ రంగంలో ఎదుగుదలకై స్పష్టమైన సంకేతమని పేర్కొన్నారు. 350 కోట్లు ఫ్రీజ్ చేసి 183 కోట్లు భాదితులకు రిఫండ్ ఇవ్వడం ఒక రికార్డు అని ఆయన అన్నారు.
Read Also: Manchu Manoj : పోలీసులతో గొడవ.. వీడియో రిలీజ్ చేసిన మంచు మనోజ్
డిజిటల్ యుగంలో కొత్త అడుగులు, అలాగే సైబర్ నేరాలకు సంబంధించిన రిస్క్ లు కూడా పెరుగుతున్నాయని ఆయన అన్నారు. మనకంటే మన గురించి గూగుల్ కే ఎక్కువ తెలుసని.. కాబట్టి డిజిటల్ ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీపై పెద్ద జాగ్రత్త అవసరమని వెల్లడించారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఇంకా పవర్ గ్రిడ్ వంటి క్షేత్రాల్లో కూడా ప్రవేశించారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సైబర్ నేరస్తులు మన డబ్బులు మాత్రమే కాదు, మన డేటాను కూడా దొంగలిస్తునారని హెచ్చరించారు.
Read Also: KTR: సీఎం ప్రజల్ని మోసం చేసి గెలిచాడు.. రైతు నిరసన దీక్షలో కేటీఆర్
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సైబర్ నేరాలు దాదాపు 10 ట్రిలియన్ రూపాయలను వసూలు చేస్తున్నాయని, మన దేశంలో సైబర్ నేరాల ద్వారా 15 వేల కోట్లు కాజేస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం కొత్త సెక్యూరిటీ పాలసీని ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, సైబర్ డిఫెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇకపై సైబర్ సెక్యూరిటీ పరంగా తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా, సైబర్ చాలెంజ్‌లను అధిగమించేందుకు “షీల్డ్ కాంక్లెవ్” అనేది ఎంతో ఉపయోగకరమవుతుందని ఆయన చెప్పారు.