ఢిల్లీలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ, స్కూళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, పార్కులను మూసేసిన సంగతి తెలిసిందే. 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, బార్లు నడుస్తున్నాయి. మెట్రోను కూడా 50 శాతం సీటింగ్‌తోనే నడుపుతున్నారు. కానీ, పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పాజిటివిటీ రేటు 6 శాతం దాటిపోవడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Read: శ్రీకృష్ణుడు రోజూ నా కలలోకి వస్తున్నాడు: అఖిలేష్
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో శని, ఆదివారాల్లో పూర్తి కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీతో పాటు అటు ముంబై, కోల్‌కతా, మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఆయా ప్రభుత్వాలు కూడా ఢిల్లీ బాటలో నడిచే అవకాశం ఉన్నది.