Cucumber Rice Recipe: ఇంటి వంటల్లో కొత్తదనం కోరుకునేవారికి ఇది అద్భుతమైన రెసిపీ అనుకోవచ్చు. సాధారణంగా దోసకాయను సలాడ్ లేదా పచ్చడికే ఉపయోగిస్తాం. కానీ దోసకాయతో రుచికరమైన అన్నం తయారు చేయొచ్చంటే చాలా మందికి ఆశ్చర్యమే. అవునండి బాబు.. తక్కువ సమయంలో తేలికగా, ఆరోగ్యకరంగా సిద్ధమయ్యే ఈ దోసకాయ అన్నం లంచ్‌బాక్స్, త్వరగా భోజనం తయారు చేయడానికి, మిగిలిపోయిన అన్నం వినియోగానికి బాగా సరిపోతుంది. మరి ఈ కొత్త ‘దోసకాయ అన్నం’ ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం…