బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి నియంత్రణలేని క్రిఫ్టోకరెన్సీని ఏ దేశం కూడా ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు. క్రిఫ్టోకరెన్సీని వినియోగిస్తున్నప్పటికీ అధికారికంగా గుర్తింపు లేకపోవడంతో దీనిపై పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఎల్‌సాల్వెడార్ దేశం క్రఫ్టోకరెన్సీని అధికారికంగా గుర్తించి సంచలనంగా మారింది. ప్రస్తతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే మాయం అవుతుందని, బిట్‌కాయిన్ రూపంలో కరెన్సీ చలామణి కావడం ఖాయమని ఎల్‌సాల్వెడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె పేర్కొన్నారు. Read: ఐఎన్ఎస్ ఖుక్రీ: 32…
చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కొన్నిసార్లు అవసరం లేదని పడేసిన వస్తువుల విలువ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలానే యూకేకు చెందని జేమ్స్ హువెల్స్ మాజీ భార్య 2013 వ సంవత్సరంలో పనికి రాదేమో ఆని చెప్పి ఓ హార్డ్ డిస్క్‌ను చెత్తబుట్టలో పడేసింది. ఆ హార్డ్ డిస్క్ విలువ ఇప్పుడు రూ.3,404 కోట్లు. వామ్మో అంత విలువనా… అందులో ఏముంది అనే డౌట్ రావొచ్చు. ఆ హార్డ్ డిస్క్‌లో 7500 బిట్ కాయిన్స్…
చాలా దేశాల్లో సంపాదించే డబ్బుకన్నా కట్టాల్సిన టాక్స్‌లు అధికంగా ఉంటాయి. చట్టాలు కూడా కఠినంగా ఉండటంతో ఖచ్చితంగా ట్యాక్స్‌లు కట్టాల్సిఉంటుంది. వాటి నుంచి తప్పించుకునేందుకు ట్యాక్స్‌లు తక్కువగా ఉండే దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అమెరికాలో టాక్స్‌లు అధికంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అందుకే చాలామంది డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటున్నారు. చాలా దేశాలు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా క్రిప్టో కరెన్సీ వాడకానికి అనుమతులు ఇవ్వడంతో వస్తువులను, ప్రాపర్టీస్‌ను క్రిప్టో నుంచి కొనుగోలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల్లో విదేశీయులకు…
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే వాట్సాప్ లో అనేక అధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వాట్సప్ ద్వారా డబ్బులు చెల్లించే, బదలాయించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు ఇందులోనే మారో ఆప్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయింది. క్రిప్టో కరెన్సీపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు ఉన్నప్పటికీ బడా సంస్థలు క్రిప్టో కరెన్సీ పై పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. ఎలన్ మస్క్, యాపిల్ కంపెనీలు క్రిప్టో కరెన్నిలో…
శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాల్లో క్రిప్టో, డిజిటల్ కరెన్సీపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని నిర్ణయిస్తూనే, డిజిటల్ కరెన్సీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1934 చట్టంలో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఈరోజు సభ ప్రారంభమయ్యాక డిజిటల్ కరెన్సీపై ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి. Read: ఒమిక్రాన్…
ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ మాట బాగా వినిపిస్తోంది. అనేక రంగాల్లోకి క్రిప్టో కరెన్సీ ప్రవేశించింది. కార్ల కొనుగోలు నుంచి షాపింగ్ వరకు క్రిప్టో కరెన్సీని వినియోగిస్తున్నారు. అయితే, మనదేశంలో క్రిప్టో కరెన్సీకి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రైవేట్ ఎక్సేంజీలపై నిషేదం విధించింది. క్రిప్టో కరెన్సీ ఎవరి నియంత్రణలో ఉండవు కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయడం కష్టంతో కూడుకున్నది. ఇక క్రిప్టో కరెన్సీపై భారత ప్రభుత్వం ఓ బిల్లును తీసుకురాబోతున్నది. శీతాకాల సమావేశాల్లో…
ఇప్పుడు ప్రపంచం మొత్తం క్రిప్టో కరెన్సీ గురంచే చర్చించుకుంటున్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో, ఎవరి నియంత్రణ లేని విధంగా ఈ కరెన్సీ నడుస్తుంది. డిమాండ్, సప్లై పై ఆధారపడి క్రిప్టోకరెన్సీ విలువ ఉంటుంది. అయితే, నియంత్రణలేని కరెన్సీని ఏ దేశం కూడా అధికారికంగా ఆమోదించలేదు. ఇక ఇదిలా ఉండే, నవంబర్ 29 నుంచి జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ది క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్…
క్రిప్టో కరెన్సీ… ఇప్పుడు ఎక్కడ విన్నా అదే మాట. ఎవరి అజమాయిషిలో లేని విధంగా డి సెంట్రలైజ్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఈ క్రిప్టోకరెన్నీ నడుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఎవరి అజమాయిషి ఉండనప్పటికీ అరాచక శక్తుల చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తె దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా యువత తప్పుడు మార్గంలోకి పయనించే అవకాశం ఉంటుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన దేశాలు క్రిప్టో కరెన్సీపై సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని…
కరెన్సీ ఎన్నిరకాలుగా మార్పులు జరగాయో చెప్పాల్సిన అవసరం లేదు. నోటు నుంచి డిజిటల్ కరెన్సీగా మార్పులు చెందిన సంగతి తెలిసిందే. దేశంలో డీమానుటైజేషన్, కరోనా కాలంలో డిజిటల్ కరెన్సీ విధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. డిజిటల్ పేమెంట్ రూపంలోనే లావాదేవీలు నడిచాయి. క్యాష్‌లెస్ పేమెంట్ల విధానం ద్వారానే అధికసంఖ్యలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్ గేట్‌వేలు అనేకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా క్రిప్టో కరెన్సీ మాట వినిపిస్తోంది. క్రిప్టో కరెన్సీని…
క్రిప్టో కరెన్సీతో దేశ యువత మోసపోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. క్రప్టో కరెన్సీపై ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన యువ తను హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఆందోళనలు లేవనెత్తారు. “పారదర్శకత లేని కరెన్సీ ప్రకటనల” ద్వారా యువతను తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తగా మసలుకోవాలని ప్రధాని సూచించారు. దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరముందన్నారు. వివిధ దశలలో దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఏకాభిప్రాయం కోసం…