చిన్న చిన్న తప్పులు చేయడం సహజమే. కొన్నిసార్లు అవసరం లేదని పడేసిన వస్తువుల విలువ భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలానే యూకేకు చెందని జేమ్స్ హువెల్స్ మాజీ భార్య 2013 వ సంవత్సరంలో పనికి రాదేమో ఆని చెప్పి ఓ హార్డ్ డిస్క్‌ను చెత్తబుట్టలో పడేసింది. ఆ హార్డ్ డిస్క్ విలువ ఇప్పుడు రూ.3,404 కోట్లు. వామ్మో అంత విలువనా… అందులో ఏముంది అనే డౌట్ రావొచ్చు. ఆ హార్డ్ డిస్క్‌లో 7500 బిట్ కాయిన్స్ ఉన్నాయట. బిట్ కాయిన్స్ ను ఎన్ క్రిప్టెడ్ సెక్యూరిటీతో హార్డ్ డిస్క్‌లో భద్రపరుస్తారు. ఎవరూ దానిని తీసేందుకు, నియంత్రించేందుకు వీలుండదు.
Read: ప్రముఖుల రక్షణ కోసం రంగంలోకి మహిళా కమాండోలు…
ఇప్పుడు ఆ 7500 బిట్ కాయిన్ల విలువ సుమారు 3,404 కోట్లు. చెత్త బుట్టపాలైన ఆ హార్డ్ డిస్క్ కోసం జేమ్స్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అమెరికాకు చెందిన ఓన్‌ట్రాక్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గతంలో నాసా కూడా ఈ కంపెనీ సహకారంతో కొలంబియా స్పేస్ షటిల్‌ను కనిపెట్టింది. హార్డ్ డిస్క్ దొరికితే దానిని క్రాక్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవచ్చన్నది జేమ్స్ ఆలోచన. మరి 2013లో పోగొట్టుకున్న ఆ హార్డ్ డిస్క్ దొరుకుతుందా చూడాలి.