కరెన్సీ ఎన్నిరకాలుగా మార్పులు జరగాయో చెప్పాల్సిన అవసరం లేదు. నోటు నుంచి డిజిటల్ కరెన్సీగా మార్పులు చెందిన సంగతి తెలిసిందే. దేశంలో డీమానుటైజేషన్, కరోనా కాలంలో డిజిటల్ కరెన్సీ విధానం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. డిజిటల్ పేమెంట్ రూపంలోనే లావాదేవీలు నడిచాయి. క్యాష్‌లెస్ పేమెంట్ల విధానం ద్వారానే అధికసంఖ్యలో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి.
డిజిటల్ పేమెంట్ గేట్‌వేలు అనేకం ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఎక్కడ చూసినా క్రిప్టో కరెన్సీ మాట వినిపిస్తోంది. క్రిప్టో కరెన్సీని అధికారికంగా ప్రపంచదేశాలు అమోదించకపోయినా, అనధికారికంగా లావాదేవీలు జరుగుతున్నాయి. టెస్లా కంపెనీ లాభాల బాట పట్టడానికి కారణం కూడ ఈ క్రిప్టోకరెన్సీనే.
Read: పాక్‌లో కొత్త ఫీవర్: కిటకిటలాడుతున్న ఆసుపత్రులు…
అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఎంటి? ఎందుకు తీసుకొచ్చారు. ఈ క్రిప్టో కరెన్సీని రూపోందించినది ఎవరో తెలుసుకుందాం. డిజిటల్ కరెన్సీ విధానం ప్రభుత్వాలు, బ్యాంకుల అజమాయిషి, నియంత్రణలో ఉంటుంది. దానికి భిన్నంగా ఎవరి నియంత్రణలో లేకుండా డీసెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా విలువ, డిమాండ్, సరఫరా ఆధారంగా బ్లాక్ చెయిన్ సిస్టమ్ ద్వారా ఈ కరెన్సీ రన్ అవుతుంది. ఇది పూర్తిగా వర్చువల్ కరెన్సీ. ఇవి సెంట్రల్ సర్వర్ తో పనిలేకుండా, ఎవరి అజమాయిషి లేకుండా పనిచేస్తాయి.
క్రిప్టో కరెన్సీ విధానాన్ని తయారు చేయడానికి అనేకమంది ప్రయత్నం చేశారు. అయితే, ఈ కరెన్సీని తయారు చేయడంలో సతోషి నకమోటో అనే వ్యక్తి సఫలం అయ్యారు. ఈ క్రిప్టో కరెన్సీ విధానాన్ని 2008 లో కనిపెట్టినా, ఇటీవల కాలంలోనే అధికంగా వినియోగిస్తున్నారు. డీసెంట్రలైజ్ సిస్టం కావడంతో ఎవరి అజిమాయిషి ఉండదు కాబట్టి ఈ కరెన్సీని అమోదించే విషయంలో ప్రపంచ దేశాలు వెనకడుగు వేస్తున్నాయి.