రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. పలు ప్రాంతాల నుంచి తరలిరావడంతో.. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయానికి చేరుకున్నారు భక్తులు. ఈసందర్భంగా ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తజనం. స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును ఎంతో భక్తితో చెల్లిచుకున్నారు. ఆలయంలోని కళాభవన్ లోని స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం తదితర ఆర్జిత సేవలలో భక్తులు భక్తితో హాజరయ్యారు. భక్తులు వారి తలనీలాలు సమర్పించే భక్తులతో కల్యాణ…