నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పాలకవర్గాలను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లాక్కుంటోందని ఆరోపించారు. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు గెలవడంపై స్పందించిన అంబటి రాంబాబు ఈ విజయాన్ని కుట్రలతో సాధించారని విమర్శించారు. గుంటూరులో 57 డివిజన్లలో వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, టీడీపీ స్టాండింగ్ కమిటీని చేజిక్కించుకుందని ఆయన ఆరోపించారు. ‘మా కార్పొరేటర్లను లాక్కొని, కొందరితో క్రాస్…
దేశ వ్యాప్తంగా మంగళవారం రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మెజార్టీ ఉన్న కూడా సీటు కోల్పోయింది. అనూహ్యంగా ఒక సీటు బీజేపీ ఖాతాలో పడిపోయింది.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో జరిగిన క్రాస్ ఓటింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అభివృద్ధి పనులు, ప్రజాసేవనే ప్రజలు గుర్తుంచుకుంటారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని, సౌమ్యుడైన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాదిరిగా కొంత కఠినంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విజేత తాతా మధుసూదన్ అన్నారు. స్థానిక సంస్థల…
ఖమ్మంజిల్లా టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా? ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించిందెవరు? పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్‌పైనే కొనసాగుతోంది. పోలింగ్ జరిగిన జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి…
పోలింగ్ జరిగిన ఆరుచోట్లా ఎమ్మెల్సీ సీట్లను టీఆర్‌ఎస్ కైవశం చేసుకున్నా.. ఆ జిల్లాలో మాత్రం పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఎన్నిక ఏదైనా అక్కడ వెన్నుపోట్లు తప్పదా..? భారీగా క్రాస్ ఓటింగ్‌కు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్ సూత్రధారి ఎవరు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌కు చెందిన తాతా మధు గెలిచారు. పార్టీ శ్రేణలు సంబరాలు చేసుకున్నాయి. కానీ.. టీఆర్ఎస్ అభ్యర్థికి రావాల్సిన ఓట్లు రాలేదు. పైగా…
తెలంగాణలో ఇవాళ వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను.. ఆరింటిని తన ఖాతాలోనే వేసుకుంది గులాబీ పార్టీ.. అయితే, కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ అధికార పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తోంది… ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్లు.. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ అయ్యాయి… ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 116 ఓట్లు…