విజయనగరం జిల్లాలో గజరాజుల కలకలంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఏపుగా పెరిగిన పంటల్ని గజరాజులు తినేయడం, ధ్వంసం చేయడంతో విజయనగరం జిల్లాలో రైతులు ఆవేదన చెందుతున్నారు. నాలుగేళ్ళుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అధికారులపై మండిపడుతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించట్లేదని రైతులు ఆందోళనకు దిగారు. రహదారిని దిగ్బధించారు. కొమరాడ మండలం అర్థం గ్రామంలో గ్రామస్తులు,రైతులు నిరసనకు దిగారు. రైతుల్ని అక్కడినించి పంపించేందుకు ప్రయత్నించారు అధికారులు. కానీ రైతులు మాత్రం తమ పట్టువీడలేదు.