ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలి అని కవిత అన్నారు.
విపక్ష పార్టీలను విమర్శిస్తూ బీజేపీ పార్టీ ఓ పాటను ట్విట్టర్ వేదికగా వీడియోను పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు అవిశ్వాసంపై లోక్ సభలో చర్చ జరిగింది.