నిజామాబాద్ జిల్లాలో మహిళా బిల్లు అర్బన్ కు 60 కోట్ల రూపాయల నిధులు మంజూరు సందర్బంగా నగరంలో బీఆర్ఎస్ ఆశీర్వాద ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఐటీఐ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రలో ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలి అని కవిత అన్నారు.
Read Also: vivo Y56: స్మార్ట్‌ఫోన్ వివో వై56 సరికొత్త రూపాంతరం.. ధర ఎంత ?
మహిళా రిజర్వేషన్ల బిల్లును తక్షణమే అమలు చేయాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుత మహిళా బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిది.. అధికారంలోకి రావాలన్నదే మాత్రమే కాంగ్రెస్ పార్టీ కల కానీ.. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కానే కాదు.. ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట్లాడుతోంది.. కానీ, 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీకి ఆ తెలివి ఉంటే అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరిగేది అని ఆమె మండిపడ్డింది.
Read Also: IND vs PAK: పాక్ ఆటగాళ్లకు లైన్ క్లియర్.. భారత్కు వచ్చేస్తున్నారు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చేసిన ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిందిని అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్ఎస్ ఏది అడుగుతదో అది దేశం కోరుకుంటది అని ఆమె అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చిలక పలుకులు పలుకుతున్నాడు.. ఇప్పుడు ఓబీసి గళం ఎత్తుకున్నారు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏవీ గుర్తుకు రాదు.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది.. సీఎం కేసీఆర్.. ఈ 10 ఏళ్ళల్లో ఒక్క మత ఘర్షణ కూడా జరుగలేదు అని కల్వకుంట్ల కవిత అన్నారు.