Gandikota Murder Case: కడప జిల్లాలోని గండికోటలో జరిగిన మైనర్ బాలిక దారుణ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాలిక హత్యకు ప్రీ ప్లాన్ గా స్కెచ్ వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Shocking: అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓ మహిళా ఉద్యోగి తన మేనేజర్‌పై కత్తితో 15సార్లు దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉద్యోగస్థలంలో ఒత్తిడి, మానసిక వేధింపులు ఎంత ప్రమాదకరంగా మారుతాయన్నదానికి ఇది ఉదాహరణగా మారింది. 26 ఏళ్ల మహిళా ఉద్యోగి అఫెని ముహమ్మద్ మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో పని చేస్తోంది. అదే సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ హ్యారిస్ (39) తరచూ ఆమెను పని సరిగ్గా చేయడం లేదంటూ విమర్శిస్తూ, ఇంటికి పంపించేవారు. దీనిని…
Woman kills husband: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య, తన భర్తను హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలో జరిగింది. ఈ కేసులో 38 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు రహిమా ఖాతున్‌ని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తిని సబియాల్ రెహమాన్(40)గా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా స్క్రాప్ డీలర్. రహిమా, తన భర్త సబియాల్‌ని జూన్ 26న హత్య చేసింది.
Tragic : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా అనుమానించిన కేసు.. చివరకు ప్రేమ వ్యవహారంతో జరిగిన హత్యగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని కార్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని స్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సంఘటన…
Shocking Incident : హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఏళ్లుగా పాడుబడి నిలిచిన ఓ ఖాళీ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగులోకి రావడంతో ఆ పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. ఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో, ఓ పాడుబడిన ఇంట్లోకి వెళ్లి లోపల ఉన్న అస్థిపంజరాన్ని చూపిస్తూ రికార్డ్ చేశాడు. ఆ…
Chicken: ఇటీవల కాలంలో ఆహార విషయంలో గొడవలు హత్యలకు కారణమవుతున్నాయి. పలు సందర్భాల్లో చిన్నపాటి వివాదాలు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో ఎక్స్‌ట్రా చికెన్ డిమాండ్ చేసినందుకు ఓ వ్యక్తి తన స్నేహితుడినే చంపేశాడు. ఈ ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది.
Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
Shcoking Incident : మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతున్న సమాజంలో, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది…
Radhika Yadav: 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ రాధికా యాదవ్ హత్య సంచలనంగా మారింది. సొంత తండ్రి కూతురిని కాల్చి చంపాడు. ఘటన సమయంలో ఇంట్లో రాధికాయాదవ్ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తోంది. ఈ సమయంలోనే వెనక నుంచి కాల్చి చంపాడు. అయితే, కూతురి ఆదాయంపై ఆధారపడుతున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో, ఆమె తండ్రి 49 ఏళ్ల దీపక్ యాదవ్ ఆర్థిక పరిస్థితి గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వాళ్లిద్దరూ భార్యాభర్తలు… పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది… తర్వాత అనుమానం రోగం భర్తను వెంటాడింది… పెద్దలు సర్దిచెప్పినా అనుమానం తీరలేదు… చివరకు ఊరు మారితే మనిషి మారతాడనుకున్నాడని భార్య భావించింది… కానీ అనుమానం పెనుభూతంగా మారింది… చివరకు భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి. వెంకటేశ్వర్లుది పల్నాడు జిల్లా బొల్లాపల్లి. అదే మండలం మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారికి…