Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల మహిళను ఆమె భర్త బలవంతంగా సె*క్స్ కోసం వేధించాడు, ఆమె నిరాకరించడంతో రెండు అంతస్తుల మేడ పై నుంచి తోసేశాడు. దీంతో సదరు మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలు తీజా అనే మహిళ మో రణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమెకు 2022లో ముకేష్ అగర్వాల్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది.
UP: తోడబుట్టిన సోదరుడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ సొంత భర్త ఇంట్లోనే దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన మీరట్‌లో జరిగింది. స్థానిక వస్త్ర వ్యాపారి ఇంటి నుంచి రూ. 30 లక్షలు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఆయన భార్యే నిందితురాలు అని తేలింది. తన సోదరుడి ప్రాణాలు రక్షించేందుకు మూత్రపిండాల చికిత్స కోసం ఆమె ఈ దొంగతనానికి పాల్పడింది.
AI Fake Video Call: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో ఏఐ టెక్నాలజీతో నకిలీ వీడియో కాల్స్ ద్వారా తెలంగాణలోని పలువురు టీడీపీ నాయకుల వద్ద నుండి నగదును కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన కంచర్ల సతీష్ అనే టీడీపీ నాయకుడికి కొద్ది రోజుల క్రితం దేవినేని ఉమా పీఏ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. తను…
Crime: లిక్కర్‌లో రకరకాల ప్లేవర్స్.. టేస్టులు ఉన్నట్టుగానే.. మందు బాబుల్లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి.. మందు లోపలికి వెళ్లిన తర్వాత.. తన అసలు రూపాన్ని బయటపెట్టుకున్నేవాళ్లు కొందరైతే.. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా వేలు పెట్టేవారు మరికొందరు.. ఇంకా కొందరైతే.. తన గురించి.. తానే గొప్పగా ఊహించుకుంటారు.. ఇంకా కొందరు గమ్మున ఉంటే.. మరికొందరు.. పక్కనోడిని గెలికేస్తుంటాడు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే. మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా సీఎంను…
Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.
Crime: 15 ఏళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం మహిళా కానిస్టేబుల్ హత్యకు దారితీసింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంతో చోటు చేసుకుంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ మంగళవారం సిబ్బంది క్వార్టర్స్‌లో మృతి చెంది కనిపించింది. ఆమె మృతదేహం నగ్న స్థితిలో లభించింది. ఈ సంఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. అయితే, కొన్ని గంటల్లోనే పోలీసులు సాంకేతిక నిఘా ఉపయోగించి అమ్రేలికి చెందిన మోహాన్ పార్ఘిని నిందితుడిగా…
Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajasthan: రాజస్థాన్లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని, కోడలిని అత్తామామలు దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని డీగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఖోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాక్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ హత్యను దాచేందుకు, ప్రమాదవశాత్తు మృతిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. మహిళ మృతదేహాన్ని ఇంట్లో మంటల్లో కాల్చడానికి ప్రయత్నించారు. ఆమె ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులకు అనుమానం రావడంతో దహన సంస్కారాలు…
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో మేనల్లుడిని, మామనే గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న మేనల్లుడిని హత్య చేసిన కేసులో ఒకరిని హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతేడాది ఫిబ్రవరి 18న జరిగిందని, డీఎన్ఏ పరీక్షల తర్వాత సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దేవీరామ్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ అతుల్ శర్మ తెలిపారు.