రాను రాను మనుషులలో కొంత క్రూరత్వం మరింతగా పెరిగిపోతుంది. భూమ్మీద ఎలాంటి స్వార్థం కాకుండా ఒక మనిషిని ప్రేమించగలగేది వారి తల్లి మాత్రం ఒక్కటే అని సులువుగా చెప్పవచ్చు. తల్లికి తన భర్త తోడు ఉన్న లేకున్నా తన పిల్లల్ని మాత్రం ఎంతో బాధ్యతగా పెంచి వారిని ప్రయోజకులను చేస్తుంది. కన్నతల్లి చూపించే ప్రేమ ముందర ఎన్ని కపట ప్రేమలు వచ్చిన తక్కువే. అయితే తల్లి అంత ప్రేమ చూపించిన వారి పుత్రులు మాత్రం ఆమెపై అదే…
తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్‌ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న జంటల్లో ఇటీవల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య తర్వాత ఇలాంటివి చాలా ఘటనలు నమోదవుతున్నాయి.
బీహార్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. మద్యం మత్తులో తండ్రి కూతురిని హత్య చేశాడు. అనంతరం.. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. రాత్రి సమయంలో మృతదేహాన్ని బయట పడేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు…
Human Sacrifice: హర్యానాలో దారుణం జరిగింది. దేవత కలలో కనిపించి నరబలి కోరిందని చెబుతూ ఓ మహిళ యువకుడిని హత్య చేసింది. బుధవారం సాయంత్రం ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రియా ఇంట్లో మహేష్ గుప్తా(44) మృతదేహం లభ్యమైంది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
Alcohol: మద్యం తాగొద్దని మంచి సలహా ఇవ్వడమే పాపమైంది. ఇది నచ్చని ఇద్దరు యువకులు 45 ఏళ్ల వ్యక్తిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన బెంగళూర్‌లో జరిగింది. నగరంలోని రామచంద్రపురలో జరిగిన ఈ హత్యలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.