PoK Protest: పీఓకేలో పాక్ సైన్యం అరాచకం.. కాల్పుల్లో 20 మంది ఉద్యమకారులు మృతి..
- పాకిస్తాన్ పీఓకేలో భారీ నిరసలను..
- క్రూరంగా అణచివేస్తున్న పాకిస్తాన్ సైన్యం..
- కాల్పుల్లో 20 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పాకిస్తాన్ సైన్యం దారుణాలకు ఒడిగడుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలను కాల్చి పారేస్తోంది. గత 24 గంటల్లో కనీసం 20 మంది ఈ కాల్పుల్లో మరణించగా, 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. రావలకోట్ డ్రేక్ ఎయిత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఉద్యమానికి సారధ్యం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ప్రతినిధి ఉమర్ నజీర్ కశ్మీరీ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా మృతుల్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.
జూన్ 5 నుంచి పీఓకేలో ఎన్నికలకు, రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రారంభమైంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ బలగాల కాల్పుల్లో 80 మంది మరణించిట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతున్న వీడియోల్లో రోడ్లపై మృతదేహాలు కనిపిస్తున్నాయి. పీఓకేకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అకీల్ భాయ్ పోస్ట్ చేసిన వీడియోలో ‘‘రావలకోట్ మృతదేహాలు, క్షతగాత్రులతో నిండిపోయింది. అంతర్జాతీయ మీడియా మాకు అండగా నిలవాలి’’ అని కోరారు.
Also Read
- Turkey-Netanyahu: నెతన్యాహును టార్గెట్ చేసిన టర్కీ.. ఇంటర్‌పోల్‌కు కీలక అభ్యర్థన
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
మరోవైపు, పీఓకేలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్ని బహిష్కరించాలని అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం 14 వేలకు పైగా సాయుధ భద్రతా సిబ్బందిని మోహరించింది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, కాల్పులకు పాల్పడుతోంది. పీఓకే వ్యాప్తంగా మొబైల్ సేవలు, ఇంటర్నెట్ బంద్ చేసింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటిని కూడా నిలిపేపేసినట్లు వార్తలు వస్తున్నాయి. పీఓకేలోని 53 సభ్యుల అసెంబ్లీలో 45 స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ జూలై 27న జరగగా, మిగిలిన దశలు ఆగస్టు 2, ఆగస్టు 10 తేదీల్లో నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!