Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా…
Crime: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణాల జిల్లాలోని హస్నాబాద్‌లో వైద్యం కోసం వచ్చి మహిళా పేషెంట్‌పై డాక్టర్ అత్యాచారం చేశాడు. యాంగ్జైటీ, టెన్షన్ పరిస్థితుల్లో మాససిక ప్రశాంతత కోసం ఇచ్చే ట్రాంక్విటైజింగ్ సీరమ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానిక ఒడిగట్టాడు. ఈ కేసులో సదరు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్‌కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అల్ జుబేల్ కాలనీకి చెందిన సోహైల్ (25) బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు.
మహిళల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున వాదనలు చేస్తున్నాయి. అయినప్పటికీ, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మాలపాడ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
YouTuber Couple Found Dead: కేరళలో యూట్యూబ్ జంట మృతి సంచలనంగా మారింది. కేరళోని పరస్సాల పట్టణంలోని వారిని నివాసంలో ఆదివారం శవాలుగా కనిపించారు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. వీరిద్దరు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Husband Murder: ఈ రోజుల్లో ఆస్తికోసం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు విలువ లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. జన్మనిచ్చిన వాళ్లను కూడా ఆస్తి కోసం హత్య చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. వ్యాపారవేత్త రమేశ్‌కుమార్(54) హత్యకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్ సమీపంలో హత్య చేసి ఊటీ ఎస్టేట్‌లో ఆయన మృతదేహాన్ని తగులబెట్టారు. ఉప్పల్-భువనగిరి ప్రాంతంలో ఆయనను హత్య చేసినట్లు తెలిసింది. భార్య నిహారిక, ఆమె…
CRIME: ఢిల్లీకి చెందిన గర్భిణీ యువతిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆమె లవర్. హర్యానలోని రోహ్తక్లో ఆమె ప్రియుడు, మరో ఇద్దరు కలిసి హత్య చేసి పూడ్చిపెట్టారు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ప్రియుడు ఒత్తిడి తెచ్చినప్పటికీ యువతి వినలేదు. దీంతోనే ఈ హత్యకు పాల్పడ్డాడు.
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. కొడుకు తన స్నేహితులతో కలిసి తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఇటీవల మహిళ మృతదేహం లభించింది. దీనిపై విచారించిన పోలీసులు.. సొంత కొడుకే హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. డీజే మిక్సర్ రిపేర్ కోసం డబ్బులు అడిగితే, తల్లి నిరాకరించడంతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. కొడుకు, అతడి ఫ్రెండ్స్‌ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.