విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువు నీచంగా ప్రవర్తించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ విద్యాసాగర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Murder Mystery: ఎలాంటి ఆధారాలు లేని ఒక హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులకు ‘‘ఈగలు’’ సాయపడ్డాయి. తన మామని చంపిన కేసులో 19 ఏళ్ల యువకుడిని పట్టించాయి. చివరకు ఈగల వల్ల యువకుడు తాను చేసిన హత్యా నేరాన్ని ఒప్పుకున్నాడు. సరైన సాక్ష్యాధారాలు లేకున్నా పోలీసులు ఈ కేసును ఛేదించారు.
తిరుపతిలోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోక్సోకేసులో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో ఆ బాలిక 9వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శలపాక గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక…
సంగారెడ్డి జిల్లా నిజాంపేట (మం) ఖానాపూర్(బీ) గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై ఉన్న బంగారు గుండ్ల కోసం అమ్మమ్మను హత్య చేశాడు మనవడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులు, మెడలోని బంగారు గుండ్ల కోసం అమ్మమ్మ దుర్గమ్మ(60)తో గొడవపడ్డాడు మనవడు మహేష్(26).
Crime: రాజస్థాన్లో రెండు రోజలు క్రితం అదృశ్యమైన 50 ఏళ్ల బ్యూటీషియన్ శరీర భాగాలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో కనిపించాయి. మహిళను ఆమెకు తెలిసిన వ్యక్తి హత్య చేసి, ఆమె శరీర భాగాలను ఆరు ముక్కలు చేసిన నిందితుడు, ఇంటి సమీపంలో పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 28న బాధితురాలు అనితా చౌదరి మధ్యాహ్నం తన బ్యూటీ పార్లర్ మూసేసిన తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. మరుసటి రోజు ఆమె భర్త మన్మోహన్ చౌదరి జోధ్పైర్ పోలీస్…
UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు శిక్షణ పొందుతున్న జిమ్లోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకుంది. ఏడాదిన్నర క్రితం దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో, అలహాబాద్ హైకోర్టు జోక్యంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Road Accident: హైదరాబాద్లోని షాపూర్ నగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు రాంకీ సంస్థలో పనిచేసే హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఘటనాస్థలిలో ప్రమాదానికి కారణమైన బస్సుపై వాహనదారులు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఉదయం రోడ్లపై పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు రోడ్డుపై…
Karnataka: కర్ణాటకకు చెందిన మహిళా నాయకురాలు, ఆ రాష్ట్ర మాజీ మంత్రిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్తో గత కొంత కాలంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న మంజులా అనే మహిళ, ఆయనకు సంబంధించిన వాట్సాప్ కాల్స్, అభ్యంతరకరమైన వీడియోలను ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసింది. వీటిని నిలిపేయాలంటే తనకు రూ. 20 లక్షలు కావాలని డిమాండ్ చేసింది. బ్లాక్మెయిల్, దోపిడికి పాల్పడిన కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కలబురిగిలో జిల్లా…