Shocking News: ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని ఎటావాలో ఆస్తి వివాదంలో, డీలర్ అతడి భాగస్వామి కలిసి ఆమెను హత్య చేశారు. నిందితులు శివేంద్ర యాదవ్(26), అతడి సహాయకుడు గౌరవ్(19)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గురైన బాధితురాలని 25 ఏళ్ల అంజలిగా గుర్తించారు.
నిందితులు ముందుగా అంజలికి ఆస్తి పత్రాలు ఇస్తామని ఫోన్ చేశారు. ఆ తర్వాత వారు ఆమెతో బలవంతంగా మద్యం తాగించి, గొంతు నులిమి చంపి, దహనం చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని యమునా నదిలో పారేశారు. ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన అంజలి మృతదేహం దారుణమైన స్థితిలో లభించింది. అంజలి మృతదేహాన్ని చూపించడానికి నిందితుడు తన తండ్రి, భార్యకు వీడియో కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Bengal Waqf Violence: వక్ఫ్ ముసుగులో హింస.. సొంత ప్రాంతం నుంచి హిందువులు పారిపోతున్నారు..
అంజలి కుటుంబ సభ్యులు ఆమె కాలిపోయిన స్కూటర్‌ని డ్రెయిన్ దగ్గర కనుగొన్నారు. ఆ తర్వాత స్థిరాస్తి డీలర్ హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు భూమి కోసం అంజలి నుంచి రూ. 6 లక్షలు తీసుకున్నాడని ఆమె సోదరి కిరణ్ చెప్పింది. ఆ తర్వాత పత్రాలు ఇచ్చే నెపంతో అతను అంజలిని చంపేశాడని పేర్కొంది. యాదవ్, అతడి భాగస్వామి విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
భర్త చనిపోయిన అంజలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భూమి కోసం రూ. 6 లక్షలు చెల్లించినప్పటికీ, డీలర్ శివేంద్ర రిజిస్ట్రేషన్ చేయించడంలో ఆలస్యం చేస్తూనే వస్తున్నాడు. నిరాశ చెందిన అంజలి తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 07, 2025న డబ్బులు ఇచ్చే నెపంతో హత్య చేశారు. రెండు నెలలుగా ప్లాట్ ఇవ్వడానికి నిందితుడు ఆలస్యం చేస్తున్నట్లు అంజలి సోదరి కిరణ్ చెప్పింది.