పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కోల్‌కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఒక చెత్త కుప్పలో కట్ చేసి ఉన్న మహిళ తల లభ్యమైంది. కాగా.. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన బావని 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు అతిఉర్ రెహమాన్ లస్కర్‌గా గుర్తించారు.
Teen Kills Mother: కొడుకుని స్కూల్ వెళ్లాలని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి హత్యకు గురవుతుందని ఎవరు ఊహిస్తారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. డిసెంబర్ 03న ఆర్తీ దేవి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు అమన్‌ని స్కూల్‌కి వెళ్లేందుకు నిద్రలేపింది. కానీ సదరు యువకుడు మానసిక స్థితి బాగా లేదు. తన తల్లిపై కోపంతో బలంగా నేలకోసి కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి మరణించింది.
Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు.
Crime: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎక్స్ట్రా క్లాసుల పేరుతో అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగింది. నిందితుడైన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నగరంలోని చోలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది.
Black magic: ఘజియాబాద్‌లో అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లో క్షుద్రవిద్యలు నేర్చుకుని, ఓ వ్యక్తి తల నరికి బలి ఇచ్చిన ఘటన జరిగింది. బాధితుడి పుర్రెని ఉపయోగించి, పూజలు నిర్వహించి ధనవంతులు కావాలనుకున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పుర్రె, ఆయుధాలు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్‌నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు.
Man Kills Mother: తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి తన తల్లినే హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. 22 ఏళ్ల యువకుడు తాను ఎంచుకున్న మహిళను పెళ్లి చేసుకోవడానికి తల్లి నిరాకరించింది. తన ఆస్తిపై వారసత్వాన్ని కోల్పోతావని తల్లి బెదిరించడంతో హత్య జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడని అరెస్ట్ చేసిటనట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడిని సావన్ అనే వ్యక్తిగా గుర్తించారు. మొదట్లో ఈ నేరాన్ని దోపిడిగా చిత్రీకరించే పనిచేశాడు.
Digital arrest: డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ దేశంలో ఎక్కువ జరుగుతున్నాయి. పోలీస్ అధికారులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులగా ఫోజు కొడుతూ స్కామర్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
డ్రగ్స్ కు అలవాటు పడి అమ్మకం దారుగా మారిన 24 సంవత్సరాల లీలా కృష్ణ అనే యువకుడు.. ఎవరికి ఏ రకమైన డ్రగ్ కావాలన్నా సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పటికే మూడుసార్లు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన లీలా కృష్ణ గురువారం నాలుగోసారి ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. నిజాంపేట కుశాల్ పార్క్ హై టెన్షన్ లైన్ రోడ్డులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్ టీ ఎఫ్ సీఐ నాగరాజు…
Delhi Case: బుధవారం తెల్లవారుజామున ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యుల హత్యతో ఒక్కసారిగా దేశ రాజధాని ఉలిక్కి పడిన సంఘటన గురించి తెలిసిందే. ఈ ఘటనలో భార్యా,భర్త, కుమార్తె దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే, హత్య జరిగిన సమయంలో వాకింగ్ కు బయటికి వెళ్లిన కుమారుడు అర్జున్ బతికి ఉన్నట్లుగా సమాచారం అందింది. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అబ్బురపరిచే విషయాలను వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Mens…