S*exual Assault: ఒడశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే మరణించింది. ఇక, అప్పటి నుంచి సింగిల్ గానే ఉంటున్న అతడికి కామ కోరికలు క్రమంగా పెరిగిపోయాయి. వయసు మీరిందన్న సోయి కూడా లేకుండా తన వాంఛలను తీర్చుకోవాలని అనుకున్నాడు. దాని కోసం గ్రామంలో ఒంటరిగా కనిపించిన మహిళలందరినీ ఇష్టం వచ్చినట్లుగా తాకడం స్టార్ట్ చేశాడు. అర్థరాత్రి సమయంలో ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారనే విషయం తెలిస్తే చాలు.. అక్కడికి వెళ్లి మరీ వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అలా, ఇప్పటికే గ్రామంలోని ఐదుగురిని హత్యాచారం చేశాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని భయపడిన బాధిత మహిళలు ఎవరికీ చెప్పకుండా లోలోపలే కుమిలిపోయారు.
Read Also: Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!
అయితే, ఈ నెల 3వ తేదీన నిందితుడు 52 ఏళ్ల వితంతువుని రేప్ చేశాడు. ఆ విషయం తెలిపిన మిగతా ఐదుగురు బాధితురాళ్లకు తెలిసిపోయింది. దీంతో వారందరూ కలిసి ఆ వితంతువు వద్దకు వెళ్లారు. తమను కూడా ఆ నీచూడే అత్యాచారం చేశాడని చెప్పి మరీ.. ఇకపై ఇలా ఇంకెవరికీ జరగకుండా చూడాలని అనుకున్నారు. అందుకోసం అతడ్ని చంపేయాలని ప్లాన్ చేశారు. దీంతో ఈ విషయాన్ని మరో ఇద్దరు మహిళలు పురుషులకు చెప్పారు.. వారు కూడా దీనికి ఒప్పుకోవడంతో.. మొత్తం 10 మంది కలిసి జూన్ 3న అర్ధరాత్రి నిందితుడి ఇంటికి వెళ్లారు.
Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!
ఇక, నిద్రలో ఉన్న అతడిపై బాధిత మహిళలందరూ ఒక్కసారిగా దాడి చేశారు. అయినా వారి కోపం తగ్గక పోవడంతో.. అందరూ కలిసి ఆ వృద్ధుడిని తమ గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి.. అతడు బతికుండగానే శరీరానికి నిప్పంటించి.. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే, మృతుడి జాడ తెలియకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. హత్య చేసిన ఆరుగురు మహిళలతో పాటు వాళ్లకు సహకరించిన మరో ఇద్దరు మహిళలతో పాటు పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.