Delhi: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్యతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో భర్త, భార్య, కుమార్తె హత్యకు గురైన సంచలనం ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. Also Read: CM Revanth Reddy: పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభ.. పాల్గొననున్న సీఎం Triple murder in Delhi | Three people from a house including…
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గాని అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేసి వెళ్ళిపోయింది. కనీస మానవత్వంతో ఆలోచించని ఆ తల్లి ప్రేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చెత్తలో పడేసింది. మరో విధంగా ఆలోచిస్తే అమ్మ జాతికి మాయని మచ్చ తెచ్చే ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది.
విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కిరెడ్డిపాలెంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. వెంకటేశ్వర కాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి దూకి జంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. మృతులు పిల్లి దుర్గారావు, సాయి సుష్మితలుగా గుర్తించారు.
BJP Leader Suicide: గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన 34 ఏళ్ల బీజేపీ మహిళా నాయకురాలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. సూరత్‌లోని వార్డ్ మెంబర్ 30లో దీపికా పటేల్ అనే బీజేపీ మహిళా మోర్చా నాయకులురా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్త రైతు, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు.
చంచల్ గూడ జైలు అధికారులను ఖైదీ బురిడీ కొట్టించాడు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అరెస్ట్ అయిన సుజాయత్ అలీ నకిలీ బెయిల్ పత్రాలు సృష్టించి జైలు నుంచి పరారయ్యాడు. ల్యాండ్ గ్రాఫింగ్ కేసులో రెండు నెలల క్రితం సుజాయత్ అలీ అరెస్ట్ అయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి తెగబడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు.
Husband Murdered By Wife: ఓ మహిళ తన భర్తను హత్య చేసి ఆపై, అతని శరీర భాగాలను 30 ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలలో విసిరివేసింది. సిడ్నీలో 53 ఏళ్ల ఆస్ట్రేలియా మహిళ నిర్మిన్ నుఫాల్ తన 62 ఏళ్ల భర్త మమ్‌దౌహ్ ఇమాద్ ను హత్య చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మే 3వ తేదీన పశ్చిమ సిడ్నీలోని గ్రీన్కర్ హోమ్‌లో భార్య నౌఫల్ తన భర్తను…
Digital Arrest: ఇటీవల కాలంలో ‘‘డిజిటల్ అరెస్ట్’’ మోసాలు చాలా పెరిగాయి. ఇలాంటి నేరాలు పెరగడంపై ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారుల, పోలీసులుగా నటిస్తూ బాధితులను బ్లాక్మెయిల్ చేసి, అందినకాడికి దండుకోవడాన్ని డిజిటల్ అరెస్టులుగా పిలుస్తారు. బాధితులు ఏం చేయాలో తెలియక ఆ సమయంలో స్కామర్లకు డబ్బులు ఇస్తున్నారు.
ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి ఆగంతకులు కోటి రూపాయలను డిమాండ్ చేశారు. లేడీ వాయిస్‌తో ట్రాప్ చేయించి దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తుపాకీని తలపై పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
Tamil Nadu: తమిళనాడులోని ఓ కుటుంబంలోని ముగ్గురి హత్య ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్తీ మూవీ ‘‘ఖాకీ’’లాగే ఫామ్ హౌజ్‌లో ఈ హత్యలు జరిగాయి. చోరికి పాల్పడేందుకు వచ్చిన దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుప్పూర్‌లోని పొంగలూర్లో కుటుంబలోని ముగ్గురు దారణహత్యకు గురయ్యారు.