Jagtial: జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందడంతో.. హస్పటల్ ఎదురుగా గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వీడియో కాల్ మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భ సంచి ఆపరేషన్ వికటించి ఓ మహిళ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన మహిళ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: Inter-Caste Marriage: కులాంతర వివాహం.. 40 మందికి గుండు గీయించిన గ్రామ పెద్దలు..
అయితే, వివరాల్లోకి వెళితే.. సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన రాజవ్వ సంతానం కలగక పోవడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటుంది. ఇక, రాజవ్వ గర్భ సంచికి గడ్డలు ఉన్నాయని, వాటిని సర్జరీ చేసి తొలగిస్తే సంతానం అవుతుందని, ఇందుకూ గాను 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇక, ఆ వైద్యురాలి సూచన మేరకు ఆపరేషన్ చేపించుకోగా అది వికటించి రాజవ్వ మృతి చెందింది. కాగా, ఆ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే రాజవ్వ మృతి చెందిందని ఆరోపిస్తూ.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.