DGP Shivadhar Reddy: నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రియాజ్ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడు రియాజ్ తప్పించుకొని పారిపోతూ మరోసారి పోలీసులపై దాడికి తెగబడ్డాడు.. రియాజ్ ని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల దగ్గర ఉన్న వెపన్ తీసుకొని వారిపై కాల్పులకి ప్రయత్నించాడు.. మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని డీజీపీ తెలియజేశారు.
Read Also: Diwali 2025: టపాకాయలు కాల్చడంలో గాయాలయ్యాయా..? ఇంటి వద్దే సురక్షిత చికిత్స ఇలా చేసుకోండి.!
అయితే, బాత్రుంకి వెళ్లడానికి లేచిన నిందితుడు రియాజ్ సెక్యూరిటీగా ఉన్న ఇద్దరి కానిస్టేబుల్స్ నుంచి గన్ తీసుకుని వారిపై కాల్పులు జరినట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక, పోలీసులు జరిపిన ఎదురు కాల్పులో రియాజ్ చనిపోయాడు అన్నారు. నిన్న (ఆదివారం) రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్‌పై దాడి చేసిన రియాజ్, ఇవాళ మరొక కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడని డీజీపీ స్పష్టం చేశారు. కాగా, ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శివధర్ రెడ్డి పేర్కొన్నారు.