ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మనసులో పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. ప్రేమించినవారు దక్కకపోతే తమను తాము అంతం చేసుకుంటున్నారు.. లేదు అంటే ప్రేమించినవారిని అంతం చేస్తున్నారు. తాజాగా ప్రేమించిన ప్రియురాలు తనను కాదని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. అంతేకాకుండా ఆమెను చంపి పోలీసులు వచ్చేవరకు ఆమెను హత్తుకొని ఉండిపోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.…
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న…
నేటి సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న జయరాజు తన సహోద్యోగి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ మేరకు సదరు మహిళా ఉద్యోగి దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టార్ ఆఫీస్లోని ఆడిట్ సెక్షన్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళను రిజిస్ట్రార్ జయరాజు తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు…
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో గుట్కా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ శివారులో పార్టీల పేరుతో గంజాయి వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ఈ మేరకు శంషాబాద్ జోన్ డీసీపి ప్రకాష్ రెడ్డి అక్రమంగా గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా శంషాబాద్ జోన్ పరిధి లోని పలు వ్యాపార సముదాయాల పై పోలీసుల దాడులు నిర్వహించారు. Also Read : సీఎం జగన్ కాన్వాయ్ వెంట పరుగెత్తిన మహిళ.. ఎందుకంటే..? అక్రమంగా…
అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి…
రాజేంద్రనగర్లోని హైదర్ గూడకు చెందిన అనీష్ మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకు అపార్ట్మెంట్ సెల్లార్కు వెళ్లిన అనీష్ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని అనీష్ తల్లిదండ్రులు సాయంత్రం గుర్తించి పోలీసులకు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా అనీష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముందుగా ఓ మహిళ కిడ్నాప్ చేసినట్లు భావించిన పోలీసులు అది నిజం కాకపోవడంతో హైదర్ గూడ పరిసరాలను తనిఖీ చేశారు. దీంతో…
ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో…
రాజేంద్రనగర్లో 7 సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న అనీష్ అనే బాలుడు అపార్ట్మెంట్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సాయంత్రం గుర్తించి హుటాహుటిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి బాలుడి…
నేటి సమాజంలో రోజుకో చోట ఆత్యాచార సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చిన మృగాళ్లు మాత్రం మారడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా తామ కామవాంఛ తీర్చకుంటున్నారు. అన్యం పుణ్యం తెలియని చిన్నారుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు. ఇలాంటి ఘటనే రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ లో చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్ సాగర్ కు చెందిన కాంతు అనే వ్యక్తి…
గత నెల 12వ తేదిన విధులు ముగించుకోని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న (23)అనే మహిళ కానిస్టేబుల్ సెప్టెంబర్ 12న విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలు దేరింది. అయితే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్ పైకి రాగానే అనుకోకుండా జ్యోత్స్న నడుపుతున్న…