ఒక ప్రేమ జంట చేసిన ఒక పని నలుగురు ప్రాణాలు తీసింది.. ఈ దారుణ ఘటన మద్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాంద్‌పూర్ గ్రామానికి చెందిన ఒక యువకుడు.. బంధువుల పంక్షన్ లో ఒక బాలికను చూసి ఇష్టపడ్డాడు. కొద్దిరోజులు ఆమె వెనక తిరిగి ప్రేమ గురించి చెప్పాడు.. బాలిక కూడా ఒప్పుకోవడంతో కొన్నిరోజులు చెట్టాపట్టాలేసుకున్న జంట.. పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరని ఎవరికి తెలియకుండా ఇంట్లో పారిపోయారు. బాలిక తన తల్లి వెండి ఆభరణాలు తీసుకొని ప్రియుడితో వెళ్ళిపోయింది. ఈ ఘటన జరిగి రెండేళ్లు అవుతుంది. అప్పటికి నుంచి యువకుడు కుటుంబ సభ్యులకు, బాలిక కుటుంబాన్నికి పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది.
ఇక ఈ నేపథ్యంలోనే దీపావళీ నాడు బాలిక తీసుకెళ్లిన వెండి ఆభరణాల గురించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలయ్యింది. ఆ గొడవలో ఒకరినొకరు దూషించుకుంటూ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు మృతికి చెందడం సంచలనంగా మారింది. ఆ ఇద్దరు ప్రేమ జంట ఎక్కడ ఉన్నారన్నది ఇప్పటివరకు అంతుచిక్కని ప్రశ్న. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు.