బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఓ ప్రయాణికుడు సినిఫక్కిలో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసి కస్టమ్ అధికారులకు దొరికిపోయాడు. అబుదాబి నుంచి చైన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని కరిగించి సన్నటి వైర్లుగా తయారు చేసి లగేజ్ ట్రాలీ బ్యాగ్ సైడ్ లో వున్న రాడ్స్ లో అమర్చాడు.
ఆ బంగారాన్ని దర్జాగా తరలించేందుకు ప్రయత్నించగా చైన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్ అధికారులు చేసిన తనిఖీల్లో రెండు కిలోల బంగారం బయట పడింది. దీంతో సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ కోటి వరకు ఉంటుందని వారు వెల్లడించారు.