Heavy Drug Seizure: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డగా మారుతున్నాయి విమానాశ్రయాలు. ఇటీవలి కాలంలో దేశంలో పలు విమానాశ్రయాలలో అక్రమంగా ఇండియాలోకి తీసుకు వస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. తాజాగా ఇలాంటి మరో ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్ ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 15.36 కోట్ల విలువ చేసే 1024 గ్రాముల కొకైన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. పశ్చిమ ఆఫ్రికా ప్రయాణికురాలి వద్ద కొకైన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఆ లేడీ వ్యవహార శైలి పసిగట్టి అదుపులోకి తీసుకుంది కస్టమ్స్ బృందం.. పొట్టలో దాచిన కోకైన్ తో గ్రీన్ చానెల్ దాటే యత్నం చేసింది కిలాడి లేడి. తమదైన శైలిలో అధికారులు ప్రశ్నించడంతో పొట్టలో కొకైన్ దాచినట్లు బయటపడింది. దీంతో వెంటనే ఆ ప్రయాణికురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం పొట్టలో దాచిన 82క్యాప్యూల్స్ ను డాక్టర్లు బయటకు తీశారు. నిందితురాలి పై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.