A Strange Case: సాధారణంగా అమ్మాయిల మీద అబ్బాయిలు అత్యాచారం చేస్తూ ఉంటారు.. ఈ మధ్య అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు అని వింటూనే ఉన్నాం. ఇక తాజాగా ఒక భార్య.. భర్తపై అత్యాచారం చేసింది.. అందులోనూ ఏకధాటిగా 29 గంటలపాటు హింసించి మరీ అత్యాచారం చేసింది.. ఏంటి వింటుంటే ఈమె కామ పిశాచి.. అసలు ఆడదేనా అని తిట్టేసుకుంటున్నారా..? ఆగండాగండి.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇదంతా భార్యతో విడాకుల కోసం ఒక భర్త కోర్టులో ఆడిన ఒక అబద్దం. ఈ వింత కేసు దక్షిణ కొరియాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాలో ఒక 40 ఏళ్ల వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఎన్నో ఏళ్ళు హ్యాపీగా ఉన్న వారి సంసారంలో కలతలు వచ్చాయి. దీంతో అతడి భార్య విడాకులు కోరుకున్నది. కానీ, కోర్టులో వీరు విడాకులు తీసుకోవడానికి సరిపడ్డా కారణాలు లేవు. అందుకే సదురు భర్త, తన భార్య తనను వేధిస్తోందని, తనను ఇంట్లో బంధించి 29 గంటల పాటు అత్యాచారానికి పాల్పడిందని చెప్పుకొచ్చాడు. ఆ బాధ భరించలేకే విడాకులు తీసుకొంటున్నట్లు తెలిపాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. తన భర్తను అత్యాచారం చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఈ వింత కేసుపై కోర్టు తీర్పునిస్తూ.. ఇలాంటి ఘటనను తామెప్పుడూ వినలేదని పేర్కొంది. వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.