Mammootty: దారి తప్పిన స్టార్ హీరోకు సామాన్యుడి సాయం.. వైరల్ అవుతున్న మమ్ముట్టీ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mammootty: మలయాళ సూపర్‌స్టార్ హీరో మమ్ముట్టీకి తమిళనాడులో ఓ సాధారణ వ్యక్తి చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్ పూర్తి చేసుకుని కేరళకు తిరుగు ప్రయాణమైన సమయంలో మమ్ముట్టీ ప్రయాణిస్తున్న కారు దారి తప్పినట్లు సమాచారం. హైవే మూసివేత కారణంగా కారు మరో మార్గంలోకి వెళ్లడంతో సరైన దారి తెలియక ఇబ్బంది ఎదురైంది. ఈ సమయంలో శివగంగై జిల్లా తిరుపత్తూర్‌కు చెందిన పాండియన్ అనే వ్యక్తి మమ్ముట్టీకి సాయం చేశారు. మమ్ముట్టీ ప్రయాణిస్తున్న మార్గం కరెక్ట్‌గా లేదని గుర్తించిన ఆయన.. తన బైక్‌పై దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్లు వెళ్లేందుకు సరైన దారి చూపించారు. దీంతో మమ్ముట్టీ సురక్షితంగా కేరళ వైపు వెళ్లే మార్గాన్ని పట్టుకోగలిగారు.
ఈ సందర్భంగా మమ్ముట్టీ.. పాండియన్‌ను కలిసి ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, పాండియన్‌ను ఆప్యాయంగా ‘నమ్మ ఫ్రెండు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. మమ్ముట్టీ తనకు ధన్యవాదాలు చెప్పడంతో పాండియన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల మమ్ముట్టీ తమిళనాడులోని కారైకుడిలో తన సినిమా షూటింగ్‌ని ముగించుకొని కేరళకు తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాండియన్ సూపర్‌స్టార్ మమ్ముట్టీకి సాయం చేశారు.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
దారి తప్పిన మమ్ముట్టీకి దారి చూపిన తమిళ వ్యక్తి
🔹 శివగంగైలో దారి తప్పిన మలయాళ నటుడు మమ్ముట్టీకి ఓ వ్యక్తి కేరళకు వెళ్లే మార్గాన్ని చూపించారు.
🔹 సాయం చేసిన వ్యక్తికి మమ్ముట్టీ కృతజ్ఞతలు చెప్పారు. ఆ వ్యక్తిని ఆప్యాయంగా ‘నమ్మ ఫ్రెండుహ్’ అంటూ పిలిచారు.
🔹 అపరిచితుడికి దారి చూపి… pic.twitter.com/oyR5wy2SLY
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 16, 2026
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?