Yash Struggle Story: పాన్ ఇండియా స్టార్ యశ్‌కి ఇలాంటి గతమా? థియేటర్లో ఆయన చేసిన పనులు తెలిస్తే షాకవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Struggle Story: రాకింగ్ స్టార్ యశ్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలు, స్ట్రగుల్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హీరోగా ఎదగక ముందు థియేటర్లో పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు థియేటర్లో పని చేశానని యశ్ తెలిపారు. అక్కడ ఊడ్చడం, తుడవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు టీలు కూడా అందించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అప్పట్లో తాను చేసిన పనిని ఎప్పుడూ కష్టంగా భావించలేదని అన్నారు. “అందరి దృష్టిలో స్ట్రగుల్ అంటే ఏమిటి? ఈరోజు ఇక్కడ కూర్చొని నా దగ్గర లగ్జరీ ఉందని చూస్తే.. అప్పట్లో నేను ఎదుర్కొన్నది స్ట్రగుల్ అనిపించొచ్చు. కానీ నా దృష్టిలో అప్పుడూ స్ట్రగుల్ ఉంది.. ఇప్పుడూ ఉంది. అప్పట్లో ఊడ్చి, తుడవడంలో కూడా ఆనందం ఉండేది. ఇప్పుడు పెద్ద అవార్డులు అందుకున్నా అదే స్థాయిలో ఆనందం ఉండకపోవచ్చు” అని యశ్ పేర్కొన్నారు. తనకు అప్పట్లోనూ, ఇప్పుడూ పని పట్ల ఒకే విధమైన దృక్పథం ఉందని చెప్పారు. పరిస్థితులను బట్టి ఒక పనిని చిన్నదిగా, పెద్దదిగా చూడకుండా.. దానిలో ఆనందాన్ని వెతుక్కోవడం ముఖ్యమని యశ్ అభిప్రాయపడ్డారు.
అలాగే ఇదే ఇంటర్వ్యూలో ఆయన తన చిన్నతనంలో ఓ నటుడి విషయంలో జరిగిన సంఘటనను కూడా గుర్తుచేసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఓ నటుడు స్కూల్ సమీపంలో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో అతడిని కలిసేందుకు వెళ్లానని చెప్పారు. అయితే ఆ నటుడు తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఆ తర్వాత ఆయన సినిమాలు చూడటం కూడా మానేశానని చెప్పారు. అయితే ఆ సమయంలో ఆ నటుడు పెద్ద స్టార్ కాదని, కేవలం రెండు మూడు సినిమాలు చేసిన నటుడేనని యశ్ స్పష్టం చేశారు. తాను ఎవరినీ అగౌరవపరచడం కోసం ఈ విషయాన్ని చెప్పడం లేదని, అభిమానులు ఒక నటుడిని స్టార్‌గా తీర్చిదిద్దుతారని మాత్రమే చెప్పాలనుకుంటున్నానని అన్నారు. తన దృష్టిలో అభిమానులే ఏ సినిమా నటుడికైనా అసలైన బలం అని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను స్టార్ హీరోగా ఎదిగినా.. అభిమానులు చూపించే ప్రేమ, సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. థియేటర్లో చిన్నచిన్న పనులు చేస్తూ తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన యశ్.. ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
- Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
-
Audi Q3 2026: Audi Q3 2026 లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, పనోరమిక్ సన్‌రూఫ్, 204hp ఇంజిన్‌తో కొత్త లగ్జరీ SUV
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!