Rocking Star Yash: యశ్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ ప్రశ్నించగా.. ఊహించని సమాధానం ఇచ్చిన రాకింగ్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rocking Star Yash: రాకింగ్ స్టార్ యశ్ తన పాన్ ఇండియా స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్‌చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, విజయ్ వంటి స్టార్ హీరోలతో తనను పోల్చడంపై స్పందించారు. సినీ కుటుంబాల నుంచి వచ్చిన ఈ హీరోలందరూ ఉన్నప్పటికీ.. మీరు మాత్రమే పాన్ ఇండియా స్టార్‌గా ఎలా ఎదిగారని యశ్‌ను ప్రశ్నించగా, ఆయన దీనిని అంగీకరించలేదు. ప్రతి ఒక్క స్టార్ తమ తమ స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “స్టార్డమ్, పాన్ ఇండియా వంటి పదాలు మనం చేసిన కళకు ఇచ్చే కొన్ని టెర్మినాలజీలు మాత్రమే. ఇవేవీ శాశ్వతం కాదు” అని వెల్లడించారు. ఒక శుక్రవారం స్టార్‌గా ఉన్న వ్యక్తి.. మరో శుక్రవారం ఏమీ కాకపోవచ్చని అన్నారు. అందుకే గతంలో సాధించిన సక్సెస్‌లను పట్టుకుని కూర్చోకుండా.. ప్రతి సినిమా కోసం మళ్లీ కష్టపడాల్సిందేనని అన్నారు.
“ఒక సినిమాతో విజయం సాధించాను కదా అని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కూర్చోలేను. ప్రతి సినిమాకు కష్టపడాల్సిందే. ఈ శుక్రవారం ఒకరి పేరు వినిపిస్తుంది.. వచ్చే వారం మరో హీరో పేరు వినిపిస్తుంది. ఎవరు ముందు ఉన్నారు? ఎవరు వెనుక ఉన్నారు? అనేది ముఖ్యం కాదు” అని యశ్ అన్నారు. తన దృష్టిలో అసలైన సక్సెస్ అంటే ఎంతకాలం నిలబడగలిగాం, ఎంతకాలం ప్రేక్షకుల మనసుల్లో ఉండగలిగామనేదేనని స్పష్టం చేశారు. ప్రస్తుత స్టార్డమ్ కంటే ఎక్కువగా.. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే ముఖ్యమని యశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం యశ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇతర స్టార్ హీరోలను తక్కువ చేయకుండా.. స్టార్డమ్ అనేది శాశ్వతం కాదంటూ ఆయన చెప్పిన మాటలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?