Sri Sathyasai Bride Suicide: కాళ్లపారాణి ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం పెళ్లి చేసుకున్న యువతి.. రాత్రి ఫస్ట్ నైట్ సమయానికే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన సోమవారం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. నవవధువు ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. స్థానికులు తెలిపిన డీటెయిల్స్ ఇలా ఉన్నాయి… సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కుమార్తె హర్షిత…
Snapchat: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో యువకుడు సహజీవనం చేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం, చిన్నతనం నుంచే తన అక్క, బావలకు దత్తతగా ఇచ్చిన ఓ బాలిక వారితోనే పెరిగింది. ఏడాది క్రితం పెంపుడు తల్లి అనారోగ్యంతో మరణించగా, పెంపుడు తండ్రి ప్రస్తుతం అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో బాలిక స్కూల్ మానేసి ఇంట్లోనే ఉంటోంది. Tollywood : టాలీవుడ్ లో సెటిల్ అవుతన్న పరభాష హీరోలు.. మన వాళ్ళకి…
Crime News: ఢిల్లీకి చెందిన 60 ఏళ్ల వీర్పాల్ అనే వ్యక్తి తన భార్యను ఇటుకతో కొట్టి హత్య చేసిన కేసులో ఇరవై ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అయితే, తాజాగా అతడిని పోలీసులు లక్నోలో అరెస్ట్ చేశారు. హంతకుడు 2004లో భార్యను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అప్పట్లో ఆమె మృతదేహం పక్కన రక్తంతో నిండి ఉన్న ఇటుక, విరిగిన దంతాలు, గాజులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అప్పటి నుంచి అతడు పోలీసుల కంటిమీద కునుకులేకుండా చేశాడు.…
Love Jihad: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన నవారాలోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 35 ఏళ్ల మహిళ ఇస్లాంలోకి మారాలని, తనను హింసించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఈ దారుణహత్య జరిగింది.
Vuyyuru Domestic Violence: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. శాడిస్ట్ భర్త రాంబాబు చిత్రహింసలు భరించలేక ఉరివేసుకొని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు అకృత్యాలను సూసైడ్ లెటర్లో శ్రీవిద్య వివరించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, శాడిస్ట్ భర్తను వదలొద్దని లెటర్లో శ్రీవిద్య రాసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Also Read: Jagadish Reddy vs Kavitha: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు జగదీష్…
Wife Kills Husband: భర్తలను హత్యలు చేస్తున్న భార్యల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్రమ సంబంధాలు, పెళ్లి తర్వాత వేరే వారితో ప్రేమ వ్యవహరాల కారణంగా కట్టుకున్నవాడిని కడతేరుస్తున్నారు. తాజాగా, అస్సాంలో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య, తన కుమార్తెతో కలిసి భర్తను హత్య చేసింది. దీనికి మరో ఇద్దరు యువకులు సహకరించారు. అయితే, హత్యను తప్పుదారి పట్టించేందుకు భార్య కట్టుకథ అల్లింది.
Nagpur Serial Bride: అందం, తెలివి తేటలు రెండూ ఉన్నాయి. పైగా టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కానీ తన అందాన్ని తెలివి తేటలను అమాయకులను మోసం చేయడానికి ఉపయోగించింది. పెళ్లిళ్ల పేరుతో చీటింగ్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకుని.. చివరికి తొమ్మిదో పెళ్లికి రెడీ అయింది. కానీ దురదృష్టం వెంటాడడంతో పోలీసులకు చిక్కింది. ఇంతకీ ఆ మాయలేడీ ఎవరు ? ఆ కిలాడీ కథేంటి? నిత్య పెళ్లికొడుకు.. వ్యవహారాలు…
Tragedy: గుజరాత్‌లోని సూరత్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. భార్య వేరే వ్యక్తితో ‘‘వివాహేతర సంబంధం’’ ఉందనే కారణంగా భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత వ్యక్తిని అల్పేష్ భాయ్ కాంతిభాయ్ సోలంకి(41)గా గుర్తించారు. అల్పేష్ తన 7,2 ఏళ్ల ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు, ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో భార్య, ఆమె ప్రేమికుడిని అరెస్ట్ చేశారు. Read Also: Transgender In Court:…
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తన భర్తను చంపేందుకు తన సోదరులతో కలిసి ప్లాన్ చేసింది. దాదాపుగా మరణం అంచులో ఉన్న సదరు వ్యక్తి ఓ అపరిచిత వ్యక్తి మూలంగా రక్షించబడ్డాడు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీలో జరిగింది. డాక్టర్ సహాయకుడిగా పనిచేస్తున్న రాజీవ్ అనే వ్యక్తి కాళ్లు, చేతులు విరిగిపోయి, తీవ్రమైన బాధతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
చిన్ననాటి స్నేహం ప్రేమగా మారి చివరికి పరువు హత్యకు దారి తీసిన ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. తూత్తుకుడి జిల్లా ఏరల్ సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, సెల్వి దంపతుల కుమారుడు కవిన్‌కుమార్ చెన్నై ఐటీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సెలవులకు స్వస్థలానికి వెళ్ళిన కవిన్‌కుమార్ తన తాతకు అస్వస్థతగా ఉండటంతో ఆదివారం ఉదయం పాళయంకోట కేటీసీ నగర్ ప్రాంతంలో ఉన్న సిద్ధ వైద్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రిలో తాతకు చికిత్స జరుగుతుండటంతో కవిన్‌కుమార్…