Crime News: తాను దేవుడినని ఎంత చెప్పినా తల్లి అర్థం చేసుకోవడం లేదు. దీంతో కన్నతల్లినే హతమార్చాడు ఓ యువకుడు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో కలకలం రేపింది. ఐతే అతనికి మతిస్థిమితం సరిగా లేదని చెబుతున్నారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉంటున్న లక్ష్మీదేవి, భాస్కర్ రెడ్డికి ఒకే ఒక సంతానం యశ్వంత్. కొడుకు పుట్టాడని చిన్నప్పటి నుంచి అతనిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ దంపతులు. చిన్నతనం నుంచి కొడుకు కోరిన ఏ వస్తువు కాదనకుండా, లేదనకుండా అందించారు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావడంతో తన కొడుకుని ఉన్నత చదువులు చదివించాలని ఇంజనీరింగ్ విద్య చదివించింది. అయితే చివరకు ఆ కొడుకే తల్లిపాలిట కాల యముడై ప్రాణం తీశాడు. తనకు అడిగినంత డబ్బు ఇవ్వలేదని కన్నతల్లినే కర్కశంగా గొంతు కోసి హత్య చేశాడు. తాను దేవుడినని ఎంత చెప్పినా తన తల్లి అర్థం చేసుకోలేదని.. అందుకే ఆమెను దేవుని వద్దకు పంపానని యశ్వంత్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
Road Accident: పట్టపగలే పీకలదాకా తాగి.. ఆగి ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టిన యువకుడు!
బీటెక్ పూర్తి చేసి 4 సంవత్సరాలు పూర్తి అవుతున్నా.. ఇంతవరకు యశ్వంత్ కుమార్‌కు ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఒక్కడే రూములో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తు వచ్చాడు యశ్వంత్ కుమార్. అతనికి ప్రతి నెల తల్లిదండ్రులు ఖర్చులకు డబ్బు పంపించేవారు. అయితే ఇటీవల యశ్వంత్ కుమార్ మానసిక స్థితిలో మార్పు గమనించిన తల్లిదండ్రులు యశ్వంత్ కుమార్‌ను పలుమార్లు ఇంటికి రమ్మని పిలిచినా రాలేదు. కేవలం డబ్బులు పంపించమని మాత్రమే యశ్వంత్ కుమార్ తల్లిదండ్రులకు ఫోన్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల తనకు డబ్బు పంపించమని యశ్వంత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడగగా.. ఒక్కడివే అక్కడ ఉంటూ ఏం చేస్తున్నావని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న యశ్వంత్ కుమార్ తాను అడిగిన డబ్బు ఎందుకు పంపించలేదని.. తాను ఒక దేవుడునని తాను అడిగినప్పుడు డబ్బు పంపించాలంటూ తల్లితో గొడవపడినట్లు పోలీసుల తెలిపారు. ఇంట్లోనే పక్క గదిలో స్నానం చేస్తున్న తండ్రి భాస్కర్ ఎందుకు గొడవ పడుతున్నావు అంటూ బయటకు వస్తున్న క్రమంలో తండ్రిని లోపలికి నెట్టేసి బయట గడియ పెట్టేశాడు. తల్లి లక్ష్మీదేవిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వంట రూము నుంచి ఈడ్చుకుంటూ బయట వరండాలో పడేసి మరలా ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకొన్నాడు.
Hyderabad Child Torture: నువ్వేం తల్లివి.. ప్రియుడితో కలిసి 4 ఏళ్ల కూతురుకి టార్చర్..
రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీదేవిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి యశ్వంత్ కుమార్‌ను అదుపులోకి తీస్తున్నారు. తాను ఒక దేవుడినని ఈ విషయం తన తల్లికి చెప్తే నమ్మడం లేదని.. అందుకే తన తల్లిని దేవుని వద్దకే పంపించాను అంటూ యశ్వంత్ కుమార్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. యశ్వంత్ కుమార్ మానసిక స్థితిపై పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో యశ్వంత్ కుమార్ గడిపిన పరిస్థితులు.. గతంలో ఇతని మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు లక్ష్మీదేవికి కొడుకే తలకొరివి పెట్టాలని ఆ తండ్రి ఆరాటపడ్డారు. అందుకోసం తన కొడుకును శ్మశానానికి పంపాలని పోలీసులకు మొరపెట్టుకున్నారు. అసలే మానసిక పరిస్థితి సరిగా లేని యస్వంత్ ను తల్లి దహన సంస్కారాల కోసం పంపేందుకు పోలీసులు నిరాకరించారు. చివరకు భర్త భాస్కర్.. తన భార్య లక్ష్మీ దేవికి కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు.