Karnataka: కర్ణాటక ఉడిపి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ, ఆమె ముగ్గురు కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు పొడిచి చంపారు. బాధితులు తెల్లవారుజామున ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారని పోలీసులు ఆదివారం వెల్లడించారు. దుండగులు ముందుగా మహిళను చంపిన తర్వాత ఇద్దరు పిల్లల్ని చంపారని, వీరి తర్వాత 12 ఏళ్ల కుమారుడిని కూడా చంపేశారని పోలీసులు వెల్లడించారు.
Wife kills husband: తమిళనాడులో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య అత్యంత దారుణంగా హత్య చేసింది. ప్రియుడి మోజులో పడిన సదరు ఇల్లాలు అతడితో కలిసి భర్తను కడతేర్చింది. తిరుచ్చి పోలీసులు ఈ హత్యకు పాల్పడిన మహిళ వినోదిని(26), ఆమె లవర్ భారతి(23)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జంటకు సహకరించిన మరో ముగ్గుర్ని కూడా అరెస్ట్ చేశారు.
నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు జనాలు. బంధాలు, అనుబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బంధువులు అని కూడా చూడకుండా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Gambling: సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ భర్త. భార్యభర్తల బంధాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తించాడు. భార్యను జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. తన భార్యను ఏం తెలియని నగరంలో వదిలేసి వచ్చాడు. ఈ ఘటన యూపీలో అమ్రోహాలో జరిగింది. అయితే విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు ఆమెను రక్షించి ఇంటికి తీసుకొచ్చాడు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. భార్య మరణించగా.. నిందితుడైన భరత్ పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య ఉన్నాడు. విషాదం ఏంటంటే వీరిద్దరికి 11 రోజుల క్రితమే బాబు జన్మించాడు.
Karnataka: మాటలతో మయా చేస్తూ ప్రజలను మభ్యపెట్టి దొరికినకాడికి దోచుకుంటున్నారు కేటుగాళ్లు.. తెలిసిన వాళ్ళనైనా, సొంత బంధువులనైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరికీ తెలియదు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు అని నమ్మబలికి కేటుగాళ్లు ప్రజలను మోసం చేసిన ఘటనలు గతంలో కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటు చేసుకుంది. డబ్బాలో ఉప్పు పెట్టి డబ్బులు ఉన్నాయని మోసం చేస్తూ పడ్డుబడ్డాడు ఓ వ్యక్తి.. వివరాలలోకి వెళ్తే.. తిప్పూరు…
Delhi: ఢిల్లీలో ఓ స్కూల్ క్యాబ్ డ్రైవర్ అదే స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఢిల్లీలోని సంసద్ మార్గ్ లోని ప్రముఖ పాఠశాలలో చదువుతోంది. నవంబర్ 3న బాలిక పాఠశాలకు హాజరుకాలేదు. ఈ విషయం గురించి పాఠశాల యాజమాన్యం నుంచి బాలిక తండ్రికి సమాచారం అందింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే.. షామ్లీ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు, ఓ మహిళను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అయితే అందుకు సదరు మహిళ ఒప్పుకోలేదు. దీంతో జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ వెలుపల నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.