Illicit Relationship: చాలా వరకు వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలు హత్యలకు గురైన సంఘటనలను మనం చాలానే చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ సమస్తిపూర్‌కి చెందిన ఓ వ్యక్తి భార్యతో కాకుండా మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇది తెలుసుకున్న భార్య, ప్రియురాలిని చంపాలని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
Read Also: Shraddha Das: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎయిర్‌లైన్ కంపెనీపై తీవ్రస్థాయిలో ఫైరయిన శ్రద్ధాదాస్
అక్రమ సంబంధంపై కోపంతో ఉన్న భార్య, భర్తపై ఒత్తిడి తీసుకువచ్చి అమ్మాయిని హత్య చేసేలా చేసిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. రాజ్‌కుమార్ మెహతా, అతని భార్య సంజూ దేవీలు యువతి హత్యకు ప్లాన్ చేశారు. కోడిగుడ్డులో విషం ఇచ్చి యువతిని హత్య చేసిన కేసులో పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 3న సమస్తిపూర్‌లోని ఓ చెరువు వద్ద యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. సాంకేతిక విశ్లేషణ, బాధితురాలి కాల్ లాగ్‌లను పరిశీలించిన తర్వాత హత్యలో దంపతుల ప్రమేయం ఉన్నట్లు కనుగొన్నారు. విచారణలో యువతితో రాజ్ కుమార్ అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు తేలిందని, ఇది దంపతుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసి హత్యకు పురిగొల్పిందని చెప్పారు. ఎగ్‌రోల్‌లో విషం పెట్టి చంపినట్లు నిందితులు అంగీకరించారు. ప్రస్తుత నిందితులిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి పంపారు.