Bike Theft Gang Busted: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- గచ్చిబౌలి పీఎస్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Theft Gang Busted: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 16 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఏ1 దేవకిషోర్, ఏ2 వీర వెంకట సత్యనారాయణ, ఏ5 దిలీప్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. వీరు గతంలో స్విగ్గీ డెలివరీ బాయ్స్‌గా పని చేసినట్లు తెలిసింది. జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారారు.
Read Also: Crime News: చాక్లెట్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి యత్నం
Also Read
నిర్మానుష్య ప్రాంతాలు, సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ముఠా దొంగతనాలకు పాల్పడుతోంది. ఎక్కువగా ఖరీదైన బైక్స్‌ను టార్గెట్ చేస్తూ ముఠా చోరీలు చేస్తోంది. మేజర్‌గా హాస్టల్స్, అపార్ట్మెంట్స్‌ను ముఠా టార్గెట్ చేస్తోంది. ప్రధాన సూత్రధారి దేవకిషోర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ కీస్‌ను ముఠా తయారీ చేస్తోంది. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్‌లో దొంగిలించిన వాహనాలను ఈ ముఠా దాచింది. దొంగిలించిన వాహనాలను ఆంధ్రాలో అమ్మడానికి బేరం కుదిరించుకుంది. ముగ్గురిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. మరో ఇద్దరు మైనర్ నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!