వన్డేలలో భారత్ అత్యధిక స్కోర్లు నమోదుచేసింది. ఇంతకుముందు టీమిండియా.. 2011లో వెస్టిండీస్ పై 418 పరుగులు చేసింది. 2009లో శ్రీలంకపై 414 పరుగులు, 2007లో బెరుమాడపై 413, 2002లో బంగ్లాదేశ్ పై 409, 2014లో శ్రీలంకపై 404, 2010లో సౌతాఫ్రికాపై 401 పరుగులు చేసింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో మళ్లీ అత్యధిక పరుగుల దిశగా భారత్ దూసుకెళ్తుంది.
వన్డే వరల్డ్ కప్ వచ్చే నెలలో స్వదేశంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం ఐసీసీ ప్రపంచకప్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 4 మిలియన్ US డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వనుంది. ఇండియా కరెన్సీలో ప్రపంచ కప్ ఛాంపియన్ జట్టుకు సుమారు రూ. 33 కోట్ల 17 లక్షలు రానున్నాయి. రన్నర్ కు దాదాపు రూ.16 కోట్ల 58 లక్షల ప్రైజ్…