తెలంగాణ నుంచి ఏపీకి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా?
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా..? అంటూ నిలదీశారు నారా భువనేశ్వరి.. కాకినాడలో చంద్రబాబుకు మద్దతుగా జగ్గంపేట నిర్వహించిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్వరి.. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము మా కుటుంబానికి అవసరం లేదు. నేను నడిపిస్తున్న కంపెనీలో రెండు శాతం వాటా అమ్మితే 400 కోట్లు వస్తుందని అంత దిగజారుడు పనులు చేసేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రపంచానికి హైటెక్ రంగాన్ని చూపించారు. చంద్రబాబు ప్రజల మనిషి అని అందరికీ తెలుసన్న ఆమె.. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు తప్పు చేయలేదన్నారు. తనతో పాటు ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేదే ఆయన లక్ష్యం అని.. ఏం తప్పు చేశారని ఆయనను జైలులో పెట్టారు.. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం మా కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు నారా భువనేశ్వరి.. ఎన్టీఆర్ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారని వెల్లడించారు. రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని చక్కని శిల్పంగా మార్చారు.. నిరంతరం ప్రజల కోసమే ఆయన ఆరాటపడేవారు.. రాత్రింబవళ్లు కష్టపడే మనిషిని ఎందుకు అరెస్టు చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదన్న ఆమె.. రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.. రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు వస్తుంటే అడ్డుకున్నారు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా..? అంటూ నిలదీశారు నారా భువనేశ్వరి..
అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక.. రాజధాని కోసం భూసేకరణను ఎండగట్టిన కాగ్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.. 2016-2021 మధ్య పలు అవకతవకలను జరిగినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2015-20 మధ్య కాలంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో 129 కోట్ల తగ్గుదల.. 2016-18 మధ్య కాలంలో పని తీరు గ్రాంటులో 28.93 కోట్లకు కోత పడిందని తెలిపింది. తాడిపత్రి, శ్రీకాళహస్తి, పుంగనూరు, అద్దంకి మున్సిపాలిటీలను వాటి అర్హతకు తగినట్లు పెంచలేదు అని కాగ్ గుర్తించింది. 2016-22 మధ్య కాలంలో 2022 లేబర్ సెస్ కింద 55.39 కోట్ల వసూలు చేశారని.. వసూలు చేసిన 55.39 కోట్లను ఏపీ భవన కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేయలేదని కాగ్ పేర్కొంది. రాజధాని కోసం భూసేకరణ పై గత ప్రభుత్వ తీరును ఎండగట్టిన కాగ్.. రాజధాని కోసం భూసేకరణ లో నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొలేదని తేల్చింది. రాజధానికి అవసరమైన మొత్తం భూమిలో 70 శాతం భూ సమీకరణ ద్వారా సేకరించాలనే నిర్ణయం వల్ల భారీ ఆర్థిక భారం పడిందని ఎత్తిచూపింది కాగ్ నివేదిక.. అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల వల్ల నిధులు నిరుపయోగంపై ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పు బట్టింది కాగ్ రిపోర్ట్.. 2019 మే నుంచి వివిధ పనులను నిలిపి వేశారన్న కాగ్.. దీని వల్ల ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.1505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది. జలవనరుల పరిధిలో ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా కట్టారు.. ఆ తర్వాత దీన్ని కూల్చివేయటం వల్ల రూ. 11.51 కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని పేర్కొంది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించటానికి కన్సల్టెంట్ల ఎంపికలో తగిన విధానాన్ని అనుసరించ లేదని దుయ్యబట్టింది. నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేయటాన్ని తప్పు బట్టిన కాగ్ .. భూ సమీకరణ కోసం ఏపీ సీఆర్డీఏ రూ.2,244 కోట్లు ఖర్చు చేసింది.. సేకరించిన ఈ భూమి నిరుపయోగంగా ఉందని విమర్శించింది.
చంద్రబాబు వరుస పిటిషన్లు.. విచారణ రేపటికి వాయిదా వేసిన కోర్టు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులో వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. చంద్రబాబుకు సంబంధించి ఆయన తరఫు లాయర్లు వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. బెయిల్ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని చంద్రబాబు లాయర్లు.. న్యాయమూర్తిని కోరారు.. అయితే, ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని తెలిపింది కోర్టు.. అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడతామని పేర్కొన్న న్యాయస్థానం.. విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే, సీఆర్‌పీసీ ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని లాయర్ల కోరారు.. కానీ, జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్నారు ఇతర లాయర్లు.. కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటున్నారు. కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందని చెబుతున్నారు.. మరోవైపు.. సాంకేతిక కారణాల కోసం చంద్రబాబు లాయర్ల తాపత్రయపడుతున్నారని సీఐడీ తరపు లాయర్లు విమర్శిస్తున్నారు. అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక, కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ చంద్రబాబు తరపున న్యాయవాది లూథ్రా విజ్ఞప్తి చేశారు.. కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపించారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు.. విచారణకు చంద్రబాబు సకహరించడంలేదని.. కావాల్సిన సమాచారం రావడం లేదంటున్నారు సీఐడీ అధికారులు.. దీంతో.. మరో ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ.. కోర్టులో పిటిషన్ వేసిన విషయం విదితమే.
గవర్నర్ రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలి పెట్టు వంటిదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యనించారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై తెలంగాణ రాష్ట్ర కాబినెట్ చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించడాన్ని దేవాదాయ శాఖ మంత్రి తప్పు పట్టారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం క్యాబినెట్ లో చర్చించి, ఆమోదించి పంపిన సిఫారసును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవటం రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని.. రాష్ట్ర ప్రభుత్వలపై రాజకీయ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాల అభిష్టానికి అనుగుణంగా గవర్నర్ల వ్యవస్థ వ్యవహరించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. గతంలో ఏ గవర్నర్ కూడా ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న వారిని సేవా కోటాలో ఎమ్మెల్సీలుగా ఎలా నియమిస్తారని గవర్నర్ ప్రశ్నిస్తున్నారని? అంటే గవర్నర్‌కు రాజకీయ నేపథ్యం ఉండొచ్చు కానీ గవర్నర్ కోటాలో నామినేట్ చేసే వ్యక్తికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉండొద్దా? అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ తమిళిసై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ధోరణి గవర్నర్ మార్చుకోవాలని ఆయన హితవు పలికాడు.
శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్కు ఆ స్టార్ ప్లేయర్ దూరం..!
శ్రీలంక క్రికెట్ జట్టుకు బ్యాడ్ న్యూస్.. వరల్డ్ కప్ కు ఆ స్టార్ ప్లేయర్ దూరం కానున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా.. శ్రీలంక మెయిన్ స్పిన్నర్ వనిందు హసరంగా. అతని గాయంపై మెడికల్ ప్యానెల్ హెడ్ అర్జున డి సిల్వా అప్‌డేట్ ఇచ్చాడు. రాబోయే వన్డే ప్రపంచకప్ లో హసరంగా దూరమయ్యే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా.. శస్త్రచికిత్స కోసం టీమ్ మేనేజ్‌మెంట్ విదేశీ వైద్యులను సంప్రదిస్తోందని తెలిపాడు. శస్త్ర చికిత్స చేసిన తర్వాత కనీసం 3 నెలల విశ్రాంతి తనకు అవసరమన్నాడు. టీమ్ కు కీలక ఆటగాడిగా భావించే మేము.. ముందు ఆడబోయే మ్యాచ్ ల కోసం వేచి చూస్తున్నామని డి సిల్వా చెప్పాడు. మరోవైపు వరల్డ్ కప్ లో భాగంగా.. అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు హసరంగా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. కాని అతను గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జట్టులోకి రైట్ ఆర్మ్ స్పిన్నర్‌ను తీసుకోవడానికి సెలక్టర్లు వెతికే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే.. లంక ప్రీమియర్ లీగ్‌లో గత నెలలో జరిగిన ప్లేఆఫ్‌ల సమయంలో హసరంగా మోకాలికి గాయమైంది. దీంతో అప్పటినుంచి గాయం కారణంగా ఏ మ్యాచ్ ల్లో ఆడలేదు.
పాక్ ఆటగాళ్లకు లైన్ క్లియర్.. భారత్కు వచ్చేస్తున్నారు
వన్డే ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఇండియాకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు వీసా సమస్యలు ఎదుర్కొంటుండగా.. తాజాగా శుభవార్త అందింది. ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ కు రావాల్సి ఉండగా.. వీసా కారణాలతో రాలేకపోయింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ రోజు పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందుతుంది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసా జారీ చేయబడుతుంది. ఇంతకుముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సరైన సమయానికి వీసా లభించలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన అభిప్రాయాలను ఐసీసీకి అందించింది. ఈ విషయంపై ఐసీసీ జోక్యం చేసుకుని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని బీసీసీఐని కోరింది. దీంతో ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసా అందితే.. ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ జట్టు భారత్‌కు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇక ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు మొదటగా నెదర్లాండ్స్‌తో ఆడనుంది. అక్టోబర్ 6న హైదరాబాద్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. అక్టోబర్ 10న పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్‌లు తలపడనున్నాయి.
రోజూ చికెన్ ఎందుకు తినొద్దో తెలుసా.. వామ్మో నిజామా?
చికెన్ ను తీసుకోవడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి.. ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అయినప్పటికీ.. చికెన్ ను రోజూ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. చికెన్ తో ఎన్నో వెరైటీలను చేసుకోవచ్చు.. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65 అంటూ ఎన్నో రకాలుగా చికెన్ ను తినొచ్చు. నిజానికి చికెన్ ను ఏ విధంగా తిన్నా అదిరిపోతుంది. అంతేకాదు చికెన్ మన శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. చికెన్ లో ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. అయితే రోజూ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రోజూ చికెన్ ను తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి.. మనం శరీరానికి రోజుకు 35 శాతం మాత్రమే ప్రోటీన్స్ అవసరమావుతాయి.. ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ ను తీసుకుంటే మన శరీరం దానిని కొవ్వుగా నిల్వ చేస్తుంది. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ శరీరంలో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరిగిపోతుంది.. ఇక కొవ్వు పెరిగితే అధిక బరువు కూడా పెరుగుతారు.. చికెన్ ను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ బాగా పెరిగిపోతాయి. ఇది గండెపోటుతో పాటుగా ఇతర గుండె జబ్బులను కలిగిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ లేదా ఇతర ఆహారాలను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ఇక చికెన్ ను సరిగ్గా ఉడకపెట్టక పోయిన ప్రమాదమే..దీనిలో సాల్మొనెల్లా లేదా క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియా బయటకు రావొచ్చు. ఈ బ్యాక్టీరియా మన శరీరంపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తాయి.. ఇలాంటివి తింటే ప్రాణంతకర వ్యాదులు కూడా వచ్చే అవకాశం ఉంది.. బీ కేర్ ఫుల్ మిత్రమా…
దేవుడా.. మూడు వారాలకు.. అన్ని లక్షలు తీసుకుందా.. ?
బిగ్ బాస్ సీజన్ 7 మొదలై మూడు వారాలు ముగిశాయి. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు.. నామినేషన్స్ తో హౌస్ మొత్తం దద్దరిల్లుతుంది. ఇక ప్రతివారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నారు. మొదట కిరణ్ రాధోడ్ హౌస్ నుంచి బయటకు రాగా.. నెక్స్ట్ వీక్ షకీలా ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వీక్ దామిని ఎలిమినేట్ అయ్యింది. సింగర్ గా దామిని హౌస్ లో అడుగుపెట్టింది. తనదైన శైలితో ఇంట్లో అందరిని తనవైపు తిప్పుకుంది. అమ్మలా అందరికి వండిపెట్టింది. ఇక మొదటి వారంలో కొద్దిగా గేమ్ ఆడినా.. ఆ తరువాత వారంలో ఆమెకు ఆడే అవకాశం రాలేదు. మొదట నుంచి కూడా దామిని సేఫ్ గేమ్ ఆడుతుందని కంటెస్టెంట్స్ చెప్పినా కూడా ఆమె తాను అలా కాదని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో బూతులు మాట్లాడకూడదని చెప్పిన ఆమె ఇంగ్లిష్ లో బూతులు మాట్లాడి నామినేషన్స్ లో నిలిచింది. రెండు వారాలు సేఫ్ గా ఇంట్లో ఉన్న ఆమె మూడో వారంలో ఇంట్లో ఉండి బయటకు వచ్చింది. ఇక ఈ మూడు వారాలకు దామిని తీసుకున్న రెమ్యూనిరేషన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక దామిని వారానికి రూ.2 లక్షల మేర పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.. ఈ లెక్కన మూడు వారాలకుగానూ ఆమె రూ.6 లక్షల రెమ్యునరేషన్ అందుకుందట. ఇక దీంతో గేమ్ సరిగ్గా ఆడకపోయినా.. డబ్బులు మాత్రం బాగానే అందుకుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై సుమన్ కీలక వ్యాఖ్యలు
నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. రాజకీయాలలో ప్రత్యేక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. పరోక్షంగా రాజకీయ నాయకుల గురించి .. పార్టీల గురించి.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంతగా హీటెక్కిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయాలు మరింత వేడెక్కిపోతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ ను కోర్టు పొడిగించడంతో ఇంకా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఇక ఈ అరెస్ట్ గురించి సినీ ప్రముఖులు చాలా తక్కువమంది స్పందించారు. తాజాగా నటుడు సుమన్.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాడు. ఆయన అరెస్ట్ తప్పు కాదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చంద్రబాబు టైమ్ బాలేదని .. అందుకే ఆయన చిన్న కోర్టులో కూడా ఓడిపోయాడని సుమన్ తెలిపాడు. ఆయనకు అన్ని అనుకూలంగా వచ్చేవరకు చంద్రబాబు జైల్లోనే ఉంటారు. సీఎం జగన్ వలనే.. చంద్రబాబును అరెస్ట్ చేసారని అందరు అంటున్నారు.. కానీ అది నిజం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. అన్ని తెలుసుకున్నాకే అరెస్ట్ చేసి ఉంటారు. ఆయనను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. టైమ్ కలిసి రానప్పుడు ఇలానే జరుగుతాయి” అం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?
బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. ? అంటే .. నిజమే అని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గత రెండేళ్లు గా పూజాకు హిట్ అందుకుంది లేదు. ఇక పూజా కెరీర్ ఫినిష్ అని కొందరు.. ? పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒక ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఈ మధ్యనే గుంటూరు కారం చిత్రం నుంచి బయటకు రావడంతో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఇక ఆ చిత్రంలోనే ఈ భామ ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలు చేయకపోయినా కూడా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు దగ్గరగానే ఉంటుంది. గతకొన్నిరోజులుగా పూజా .. ఒక క్రికెటర్ ప్రేమలో ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు. ఇక దీంతో పూజా ప్రేమలో పడిందంటూ నెటిజన్స్ సైతం నమ్మేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక డైరెక్టర్ తో పూజా.. క్లోజ్ గా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు పూజా క్రికెటర్ తో ప్రేమలో పడితే డైరెక్టర్ పరిస్థితి ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో పూజాకు ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే .. ప్రస్తుతం పూజా కెరీర్ ను చక్కదిద్దుకునే సమయంలో ఇలాంటి రూమర్స్ మంచిది కాదని కొందరు చెప్పుకొస్తున్నారు.