బీసీసీఐ.. 'X' (Twitter) ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఇందులో రజనీకాంత్‌కి జై షా గోల్డెన్ టికెట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘గౌరవనీయులైన బీసీసీఐ సెక్రటరీ జై షా రజనీకాంత్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చి సత్కరించారు’ అని ఫోటోతో పాటు క్యాప్షన్ రాసింది.
సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్‌కు జట్టును ఈరోజు రాత్రి 8:30 గంటలకు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించే అవకాశం ఉంది.
India-Pak Cricket: సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే ఇండియా-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు జరగవని కేంద్రం క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి పాక్ చరమగీతం పాడకుంటే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించూడదని బీసీసీఐ ముందే నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, చొరబాట్లు, దాడులు ఆపితే తప్ప ఇరు దేశాల మధ్య క్రికెట్ సాధ్యపడదని ఆయన రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో చెప్పారు.