ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ముందు క్రికెట్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించడం లేదు. స్పోర్ట్స్ వెబ్సైట్ రెవ్ స్పోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ బోర్డు ఈసారి ఈ వేడుకను నిర్వహించడం లేదని తెలుస్తోంది.
చిన్న టీమే కదా అని అంచనా వేస్తే.. సునామీ సృష్టించారు. ఆసియా క్రీడల్లో బంగ్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్-4లో పసికూన మలేషియా.. బంగ్లాదేశ్ ను ఓడించినంత పని చేశారు. ఒకానొక సమయంలో ఈ మ్యాచ్ మలేషియా గెలుస్తుందని అనుకున్నప్పటికీ.. అఫీఫ్ హొస్సేన్ ఆల్‌రౌండ్ షో చేశాడు. బ్యాటింగ్ లో14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులతో చెలరేగగా.. బౌలింగ్ లో 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను ఆదుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో…
డేవిడ్ భాయ్ బ్యాటింగ్‌లో ఇరగదీస్తాడన్న విషయం అందరికి తెలుసు. కానీ బౌలింగ్ కూడా చేస్తాడన్నది ఎవ్వరికి తెలియదు. అతని బౌలింగ్ చూస్తే.. అచ్చం రెగ్యూలర్ బౌలర్ లానే కనపడ్డాడు. ప్రస్తుతం వార్నర్ బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ జట్టు అన్ని టీమ్‌లకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి ప్రత్యర్థి జట్లకు హడల్ పుట్టించింది. మాతో జాగ్రత అని ఓ మెస్సేజ్ పంపింది. ప్రపంచ కప్ లో వరుసగా రెండుసార్లు ఓడిపోయామని.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ లో ఆడుతున్న ఆశావాధులకు వార్నింగ్ ఇచ్చింది.
రేపు( మంగళవారం) ఆసియా క్రీడలు 2023లో భాగంగా.. భారత్-నేపాల్ మధ్య క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో తొలిసారిగా రుతురాజ్ గైక్వాడ్ భారత్ కు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఆసియా క్రీడల్లో ఆడేందుకు భారత జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లకు చోటు దక్కింది.
ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. ఈ జాబితాలో జహీర్ ఖాన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతను 23 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో జావగల్ శ్రీనాథ్ రెండో స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 34 మ్యాచ్‌ల్లో 44 మంది ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు.
మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ఎంత మంది వ్యాఖ్యతలు ఉండబోతున్నారో తెలుసా.. కామెంటేటర్స్ కోసం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక సన్నాహాలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో 120 మంది వ్యాఖ్యాతలు 9 వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించనున్నారు.