ఈనెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం హైసెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్ పోలీసులు, ఎన్ఎస్జి, ఆర్ఎఎఫ్, హోంగార్డులతో సహా వివిధ ఏజెన్సీలకు చెందిన 11,000 మందికి పైగా సిబ్బందిని మోహరిస్తారని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబరు 7న ఆఫ్ఘనిస్తాన్లోని పశ్చిమ ప్రావిన్సుల్లో సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూకంపం ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి
టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆడలేదు. కారణం అతను డెంగ్యూ బారిన పడ్డాడు. ఇక రేపు టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా శుభ్‌మన్ గిల్ ఆడటంలేదని బీసీసీఐ తెలిపింది.
ఇద్దరు క్రికెటర్లపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిషేధం వేటు వేసింది. అండర్-19 క్రికెటర్ మహ్మద్ బాబిల్లేల్, రిజిస్టర్డ్ ఆటగాడు శశాంక్ మెహ్రోత్రాలను ఐదేళ్ల పాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీమ్ సెలక్షన్ లో తప్పుడు పత్రాలు(నకిలీ వయస్సు సర్టిఫికెట్స్) ఇచ్చినట్లు హెచ్‌సీఏ నిర్ధారించింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో తలపడింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. టాప్ ఆర్డర్ మాత్రం పూర్తిగా విఫలమైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ సహా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు.
మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆటగాడు మార్క్రామ్ చెలరేగి ఆడాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ కూడా అరుదైన ఘనత సాధించాడు. 29 బంతుల్లో సెంచరీ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
ప్రపంచకప్ 2023లో నిన్న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసించాడు. విరాట్ కోహ్లి ఫిట్నెస్, వికెట్ల మధ్య పరిగెత్తడం నుండి ఒత్తిడిలో మెరుగ్గా ఆడటం వరకు అనేక లక్షణాల గురించి తెలిపాడు. అంతేకాకుండా.. విరాట్ కోహ్లీ నుండి ఇవన్నీ నేర్చుకోవాలని భారత యువ క్రికెటర్లకు సలహా ఇచ్చాడు.
2023 వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అందులో భాగంగా ఈనెల 5 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇంత పెద్ద ఈవెంట్ లో మొదటి మ్యాచ్ చూడటానికి క్రికెట్ అభిమానులు ఎక్కువగా హాజరుకాలేదు.