Shoaib Malik: బాబర్ రాజీనామా చేస్తే.. నెక్స్ట్ కెప్టెనే అతడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoaib Malik: ఈసారైనా భారత్ ను ఓడించాలన్న ధృడ నిశ్చయంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు మళ్లీ నిరాశే ఎదురైంది. గత శనివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఐతే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్‌కు ఇది వరుసగా ఎనిమిదో ఓటమి. ఈ ఓటమి తర్వాత బాబర్ ఆజామ్‌ను పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చర్చలు జోరందుకున్నాయి. బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేస్తే షాహీన్ వైట్ బాల్ కెప్టెన్‌గా మారాలని జట్టు అనుభవజ్ఞుడైన ఆటగాడు షోయబ్ మాలిక్ అన్నాడు.
Read Also: Navaratri Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలలో 16 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో ప్రదర్శన..
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
పాకిస్థాన్ కెప్టెన్సీ గురించి షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం రాజీనామా చేస్తే వైట్ బాల్ క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా చేయాలన్నాడు. అతను లాహోర్ ఖలందర్స్‌కు అటాకింగ్ కెప్టెన్ అని చూపించాడని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహీన్ అఫ్రిది తన కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా చేశాడు. అంతకుముందు 2022లో కూడా షాహీన్ అఫ్రిది కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.
Read Also: OTT Movies : ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు..వెబ్ సిరీస్ లు ఇవే..
బాబర్ ఆజం మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2019 నుండి ఇప్పటి వరకు బాబర్ మొత్తం మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, T20 ఇంటర్నేషనల్) 128 మ్యాచ్‌లకు పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. 1992 నుంచి 2023 వరకు జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై పాకిస్థాన్ వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌పై జట్టును విజయపథంలో నడిపిస్తారని బాబర్ సేన నుంచి ఆశించినప్పటికీ అది కుదరలేదు. వన్డే ప్రపంచకప్‌లో బాబర్ అజామ్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లు ఆడగా.. అందులో 2 విజయాలు సాధించింది. పాకిస్తాన్ జట్టు భారత్‌పై మాత్రమే ఓటమిని చవిచూసింది. అంతకుముందు నెదర్లాండ్స్, శ్రీలంకలను ఓడించింది.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?