Olympics: ఒలింపిక్స్ 2028లో క్రికెట్ ప్రవేశంపై తుది నిర్ణయం.. అధికారిక ప్రకటన వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Olympics: 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌తో పాటు మరో 4 క్రీడలను చేర్చాలని అధికారిక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌తో పాటు, బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్ కూడా నిర్వహించనున్నారు. గత శుక్రవారమే ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడాంశాల ప్రవేశానికి సంబంధించి చర్చలు జరిగాయి. వాస్తవానికి.. ఈ ఐదు క్రీడలను ఒలింపిక్స్ 2028లో చేర్చాలనే లాస్ ఏంజిల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజర్ల ప్రతిపాదనపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు గత వారంలోనే చర్చలను ఆమోదించింది. ఈ విషయమై ఆదివారం నుంచి ముంబైలో చివరి రౌండ్ చర్చలు సాగగా.. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒలింపిక్స్‌లో ఈ క్రీడలను చేర్చేందుకు అధికారిక ప్రకటన వెలువడింది.
IOC Session approves @LA28’s proposal for 5⃣ additional sports:
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
⚾Baseball/🥎softball, 🏏cricket, 🏈flag football, 🥍lacrosse and ⚫squash have been officially included as additional sports on the programme for the Olympic Games Los Angeles 2028. #LA28 pic.twitter.com/y7CLk2UEYx
— The Olympic Games (@Olympics) October 16, 2023
Read Also: Rashid Khan: ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆఫ్ఘాన్ స్టార్ క్రికెటర్
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశించబోతుంది. అంతకుముందు 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ను నిర్వహించారు. అంటే 128 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనుంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లో క్రికెట్‌కి ప్రవేశం లభించింది. ఇందుకోసం ఐసీసీ తీవ్రంగా శ్రమించింది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ జరుగనుంది. ఇందులో పురుషులు, మహిళల ఈవెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం 6-6 జట్లకు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని ప్రతిపాదించారు. రానున్న రోజుల్లో టీమ్‌ల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also: Nithari killings: నిఠారీ హత్యల నిందితులకు మరణశిక్ష రద్దు.. నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు..
- Tags
- announcement
- cricket
- entry
- ioc
- official
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!