ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ ప్రారంభమైంది. 2008లో ప్రారంభమైన ఈ మెగా లీగ్.. ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. 8 జట్లతో మొదలైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది టీమ్స్ ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడతున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి మరో రికార్టు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో విరాట్ 400వ మ్యాచ్ ఆడుతున్నాడు.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు.
భారత జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఒక గొప్ప ఘనత సాధించాడు. "హిట్‌మ్యాన్" గా ప్రసిద్ధి చెందిన రోహిత్ శర్మ, వన్డే క్రికెట్‌లో 11,000 పరుగులు చేసిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.