IndiGo Flight Cuts: దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్ర అంతరాయానికి గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో కార్యకలాపాలు వరుసగా దెబ్బతింటుండటంతో కేంద్రం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మొత్తం 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని ఇండిగో సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా హాజరయ్యారు. అలాగే ఇండిగో తరఫున…