రాజధానిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు సీఆర్డీఏ అధికారులు.. సచివాలయానికి 4 టవర్లు, హెచ్‌వోడీ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచారు.. హెచ్‌వోడీ టవర్ నిర్మాణానికి రూ.1,126 కోట్లకు టెండర్ పిలిచిన అధికారులు.. సచివాలయానికి సంబంధించిన 1, 2 టవర్ల కోసం రూ.1,897 కోట్లతో మరో టెండర్‌కు పిలిచారు.. ఇక, సచివాలయం 3,4 టవర్ల కోసం రూ.1,664 కోట్లతో టెండర్లు జారీ చేశారు సీఆర్డీఏ అధికారులు.. మొత్తంగా 5 టవర్లను రూ.4,668 కోట్ల వ్యయంతో చేపట్టనుంది సీఆర్డీఏ..…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఏపీ క్యాపిటల్ రీజియన్ డవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ) మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్‌శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో రాజధాని నిధుల…
Minister Narayana: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 45వ సమావేశం ముగిసింది. ఈ మీటింగ్ లో మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014- 19లో 43 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం..
రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభమైంది.. కొత్త ఏడాది లో పనులు ప్రారంభం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. అనుకున్నట్టుగానే 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ప్రపంచ బాంక్.. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేబడుతున్న పనులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇక చకచకా సాగనున్నాయి.. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు..
అమరావతిలో భవనాలను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 15వ తేదీ నుండి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించనుంది.. ఎంపిక చేసిన కొన్ని కన్‌స్ట్రక్షన్ మేజర్‌లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌లు అప్పజెప్పనున్నారు.. ఇక, పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం విదితమే.. కానీ, సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్టర్‌ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్లో చర్చ జరిగింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది..