CPI Narayana Sensational Allegations on Bigg Boss Issue: సీపీఐ నేత నారాయణ మొదటి నుంచి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తూ, బ్యాన్ చేయాలని డిమాంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షో, బిగ్ బాస్ యాజమాన్యం మీదనే కాకుండా హోస్ట్ నాగార్జున మీద కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న…
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు.
తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
CPI Narayana: ఐదు రాష్ట్రాల ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగానే టూరిజం ఆఫీస్ తగలబడిందన్నారు.
CPI Narayana: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల విడుదల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది.
కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు.
కొత్తగూడెం సభలో వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావులపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ఒక దెబ్బకు మూడు పిట్టలు.. ఒక్క ఓటుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు.. ఇండిపెండెంట్ వ్యక్తి ఉన్నాడు.. వాళ్లందరూ పోవాలన్నారు. వనమా డైపర్ లేకుండా బయటకు రాలేడు.. ఎవరి ఇంటికైనా వస్తే ఇల్లు ఖరాబు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: Priyanka Gandhi: ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిమయం.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రియాంక ఫైర్ ‘వనమా…
తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వడివడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్‌కు నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. బీఆర్‌ఎస్‌కు బీజేపీతో రాజకీయ అవగాహన ఉంది. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్లతో అన్ని…
CPI Narayana: సీపీఐ నారాయణ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. యువతకు పెద్ద పీట వేసేలా బీఆర్ఎస్, బీజపీ మ్యానిఫెస్టోలు లేవని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. యువతను బీజేపీ దగా చేస్తుందని, ఇన్ని ఏళ్లలో కనీసం కేసీఆర్ ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించలేకపోయిందని విమర్శించారు. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశాడని, ఇప్పుడు బీసీని సీఎం చేస్తానని బీజేపీ చెబుతోందని అన్నారు. బీసీని సీఎం చేస్తానని చెబుతున్న బీజేపీ,…