CPI Narayana: ఐదు రాష్ట్రాల ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగానే టూరిజం ఆఫీస్ తగలబడిందన్నారు. వందల కోట్ల అవినీతి జరిగింది…మంత్రి, ఎండి పాత్ర ఉందని అనుమానం ఉందని తెలిపారు. కేవలం అడ్మనిస్ట్రేటివ్ ఆఫీస్ మాత్రమే తగలబడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిజం శాఖలో అవకతవలపై విచారణ చేయాలన్నారు. ఎండి మనోహర్ పై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కక్షసాధింపు, అహంభావం, అవినీతి పై ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
Read also: SBI : కస్టమర్లకు గుడ్ న్యూస్… ఇకమీదట ఆ సర్వీసులు కూడా..
ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో కమ్యునిస్ట్ లకు సీట్లు ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ ఓడిందని అన్నారు. ఛత్తీస్ ఘడ్ లో కమ్యునిస్ట్ పార్టీకి బలం ఉందన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఓటమికి కాంగ్రెస్ సంకుచిత వైఖరినే అని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి కలిసి ఫైట్ చేయాలన్నారు. బీజేపీ వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ తీవ్రవాదం వల్లే దేశానికి ముప్పు వస్తోందని తెలిపారు. ఐదు రాష్ట్రాల ఫలితాలను దృష్టిలో పెట్టుకోని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మారాలని అన్నారు. ఐదు రాష్ట్రాల ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అన్నారు. దేశంలో మోస్ట్ క్రిమినల్ గ్యాంగ్ ప్రధాని, హోం మంత్రి హోదాలో ఉన్నారని తెలిపారు.
Russia Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన నేపాలీలు ?