CPI Narayana: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ పోలింగ్ రోజున తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల విడుదల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. తాజాగా ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Read Also:Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి హరీష్ రావు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ తెలుగు ప్రజలకు ద్రోహం చేసేలా ప్రవర్తిస్తున్నారని మండి పడ్డారు. వీరితో పాటు బీజేపీ కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. పోలింగ్ సందర్భంగా రాజకీయ లబ్ధి కోసం ఈ ముగ్గురూ నాగార్జున సాగర్ వద్ద అర్ధరాత్రి రచ్చ సృష్టించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కొత్తదేమీ కాదని, రాజకీయ లబ్ధి కోసమే పోలింగ్ సందర్భంగా ఈ వివాదం సృష్టించారని ఆరోపించారు. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న కుట్ర మాత్రమేనని తేల్చారు. రాజకీయ కుట్రలపై తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Read Also:Telangana Elections: ఓటేసేందుకు తరలిన ఓటర్లు.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్