CPI Narayana Sensational Allegations on Bigg Boss Issue: సీపీఐ నేత నారాయణ మొదటి నుంచి బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తూ, బ్యాన్ చేయాలని డిమాంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షో, బిగ్ బాస్ యాజమాన్యం మీదనే కాకుండా హోస్ట్ నాగార్జున మీద కూడా ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెద్ద రచ్చ జరిగింది. కొంతమంది కార్లు పగల కొట్టారు, బస్సుల అద్దాలు పగలకొట్టారు. అయితే ఆ గొడవ చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ నారాయణ హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ అనంతరం కుర్రాళ్లు కొట్టుకున్నారు. సజ్జనార్ లాంటి వాళ్లు వచ్చి ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు అంటూ కేసులు పెడతాం అంటున్నారు. అసలు బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైన షో. దానికి పర్మిషన్ ఇవ్వడం తప్పు, మళ్లీ అందులో కప్పు కొట్టారని బయట గొడవలు చేసుకుని ఆర్టీసీ బస్సులు పగలగొడితే కేసులు పెడతాం అంటున్నారు.
Ustaad: డీజే టిల్లు ను ర్యాంప్ ఆడిస్తున్న మంచు వారబ్బాయి
నేను సజ్జనార్ ను సూటిగా అడుగుతున్నా మీరు కమిషనర్ గా ఉన్నప్పుడు నేనే స్వయంగా వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్, దాని మీద యాక్షన్ తీసుకోండని అడిగా, మూడ్రోజులు తర్వాత నేను చేయలేను కోర్టుకు పొమ్మన్నారు. కింది కోర్టుకు పోతే కొట్టేసి పైకోర్టుకు వెళ్ళమన్నారు, పోలీసులు డిపార్ట్మెంట్ భయపడి, కోర్టులు భయపడి, ఏ బిగ్ బాస్ అనేది అంత ఆదర్శమైనదా? దానిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. ఆ షోలో నీచాతినీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి నాగార్జున లాంటి వాళ్లు యాంకర్ గా చేస్తున్నారు, బీజేపీ ఒకవైపు హిందూ ధర్మశాస్త్రం, భారతీయ సంస్కృతి అంటున్నా ఇది భారతీయ సంస్కృతిలో భాగమా? పాశ్చాత్య దేశాల్లో ఉండే షో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఒక రైతు బిడ్డను తీసుకొచ్చి అతనికి రూ.40 లక్షల ప్రైజ్ మనీ ఇచ్చారు. పట్టణాల్లో వాళ్ళు చూస్తున్నారు కదా అని ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారిని కూడా అట్రాక్ట్ చేసేలా రైతు బిడ్డను తీసుకొచ్చి బయట కొట్లాట పెట్టారు. దీనికి అంతా కారణం బిగ్ బాస్ చేసిన నాటకం, అసలు ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి” అంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు.